నాని రెండు జడల వెనుక దర్శకుడి ఎమోషన్

ఇటీవలే విడుదలైన ది ప్యారడైజ్ టీజర్ రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్ గా వాడటం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నెటిజెన్లు రెండుగా విడిపోయి తప్పొప్పుల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా అందరిని ఆకర్షించిన మరో అంశం నాని రెండు జెడల గెటప్. మొహంని వీడియో లో చూపించకపోయినా చాతి మీద ఆచ్చాదనా లేకుండా వెనుకవైపు పొడవాటి జడలతో అమ్మాయి తరహాలో న్యాచురల్ స్టార్ ని రివీల్ చేసిన విధానం అభిమానులను షాక్ కి గురి చేసింది.

ఇంత షాకింగ్ మేకోవర్ లో నాని నీ చూపించడానికి కారణం ఏమై ఉంటుందనే దాని మీద ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక కీలక సంగతిని పంచుకున్నాడు. ఈ రెండు జడలకు తన బాల్యానికి కనెక్షన్ ఉందని, చిన్నప్పుడు అయిదేళ్ల వయసు దాకా తల్లి తనను అలాగే పెంచిందని, ఆ స్ఫూర్తితోనే ప్యారడైజ్ లోని నాని పాత్రను డిజైన్ చేశానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఇంత కన్నా డీటెయిల్స్ చెప్పలేనని, షూటింగ్ మొదలయ్యాక సందర్భాన్ని బట్టి పంచుకుంటానని అక్కడితో ఆ టాపిక్ ని ముగించేశాడు.

సో ఊహించిన దానికన్నా జెడల స్టోరీ పెద్దదే ఉందన్న మాట. ఇప్పటిదాకా నాని కెరీర్ లో చూడనంత వయోలెన్స్ ప్యారడైజ్ లో ఉండబోతోందని టీజర్ లో హింట్ ఇచ్చేశారు కనక ఏ సర్టిఫికెట్ కి ముందే ప్రిపేర్ అయిపోవచ్చు. ఇది పెద్ద ఎత్తున సక్సెస్ కావడం శ్రీకాంత్ ఓదెలకు చాలా కీలకం. ఎందుకంటే దీని తర్వాత చిరంజీవి సినిమా ఉంది. ఇందులోనూ హింస, ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉంటాయని లీక్స్ ఊరిస్తున్నాయి. అదే నిజమైన పక్షంలో మెగాస్టార్ ని నెవర్ బిఫోర్ తరహాలో చూపించొచ్చు. 2026 మార్చిలో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.