అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‍లో పవన్ కళ్యాణ్ నటించడం అధికారికం అయింది. అభిమానులకు పవన్ ఈ చిత్రం చేయడం పట్ల అసలు ఇష్టం లేకపోయినా కానీ ఎప్పటిలానే పవన్ అభిమానుల మనోగతాన్ని లెక్క చేయకుండా ఈ సినిమాను లైన్లో పెట్టేసాడు. కనీసం కాస్త పేరున్న దర్శకుడికి అయినా బాధ్యతలు ఇవ్వకుండా అనుభవం లేని సాగర్ చంద్రకు ఇవ్వడం కూడా ఫాన్స్ లో నిరుత్సాహాన్ని నింపింది.
ఇదిలావుంటే ఈ రీమేక్ న్యూస్ మొదట బయటకొచ్చింది లగాయతు రానా దగ్గుబాటి ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తాడని చెబుతూ వచ్చారు. ఒరిజినల్‍లో పృధ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ పట్ల రానా దగ్గుబాటి చాలా ఆసక్తిగా వున్నాడని ఎన్నిసార్లు రాసినా అటు నిర్మాణ సంస్థ కానీ, ఇటు రానా కానీ కాదని ఖండించలేదు. పవన్‍కళ్యాణ్ చేయబోతున్న పాత్రకు బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ ఇలా చాలా పేర్లు వినిపించినా కానీ రానా మాత్రం కాన్‍స్టంట్‍గా వుండేవాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే అధికారికంగా ప్రకటించి మరో హీరో పేరు దాచిపెట్టారు.
పవన్‍కళ్యాణ్ పక్కన మరింత వెయిట్ వున్న యాక్టర్ కావాలని అనుకుంటున్నారా లేక పవన్ చేస్తున్నాడు కనుక ఇక మరో హీరో అవసరమే లేదని భావిస్తున్నారా అనేది ఇంకా తెలియదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates