గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ కాండ ఆధారంగా దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తీసిన విధానం ప్రేక్షకులనే కాదు విమర్శకులనూ మెప్పించింది. అయితే ఈయన తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదు కానీ ఒక మైథలాజికల్ సబ్జెక్టుతో రామ్ చరణ్ ని కలిసినట్టు ముంబై అప్డేట్.
ఆరు నెలలుగా పలు దఫాలు ఇద్దరూ కలుసుకున్నారని, ఈ కాంబోని తెరకెక్కించేందుకు నిర్మాత మధు మంతెన సిద్ధంగా ఉన్నారని దాని సారాంశం. అయితే ఫైనల్ వెర్షన్ లాక్ అయితే తప్ప అఫీషియల్ న్యూస్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వేచి చూడాలి.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్సి 16 కోసం బుచ్చిబాబుతో పని చేస్తున్నాడు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ వేగంగా జరుగుతోంది. డే అండ్ నైట్ చిత్రీకరణ చేస్తున్నారు. జాన్వీ కపూర్ త్వరలోనే జాయిన్ కానుంది. దీని తర్వాత సుకుమార్ కనక స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉంటే ఆర్సి 17 వెంటనే స్టార్ట్ అవుతుంది.
పుష్ప 2 హ్యాంగోవర్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న సుకుమార్ తక్కువ టైంలో రెడీ చేయగలరా అంటే చెప్పలేం. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే ఆర్సి18 కోసం నిఖిల్ నగేష్ భట్ రంగంలోకి దిగొచ్చు. ప్రస్తుతానికి ఇది గాసిప్ మాత్రమే. తాజాగా ఇతను ఇన్స్ టాలో చరణ్ ని ఫాలో కావడం ఫ్యాన్స్ దృష్టిలో పడింది.
గేమ్ ఛేంజర్ కోసం మూడేళ్లు పడిన బూడిదలో పోసిన పన్నీరు కావడంతో ఇకపై టైం వృథా చేయకూండా వేగంగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో హిందీ దర్శకులను కలుస్తున్నాడు. ఆ మధ్య రాజ్ కుమార్ హిరానీతో మీటింగ్ జరిగిందన్నారు కానీ తర్వాత దాని గురించి ఎలాంటి సౌండ్ లేదు.
దీని కన్నా ముందు నిఖిల్ భట్ నిర్మాత మురాద్ ఖేతానికి ఒక ప్రాజెక్టు చేయాలి. చరణ్ ఫ్రీ అయ్యేలోపు దీన్ని పూర్తి చేయొచ్చు. ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ కార్యరూపం దాలిస్తే తప్ప ఫాన్స్ ఆశలు పెట్టుకోవడానికి లేదు. అప్పటిదాకా వేచి చూడటం తప్ప ఆప్షన్ ఏముంది.