స్పిరిట్ తర్వాత సందీప్ వంగా హీరో ఎవరు

యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని డేట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకో రెండు మూడు నెలల్లో సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. ఇది జరుగుతున్న టైంలో వేరే కమిట్ మెంట్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే డార్లింగ్ ముందు ఫౌజీ, ది రాజా సాబ్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.

సలార్ 2 శౌర్యంగపర్వంకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి దాని గురించి టెన్షన్ అక్కర్లేదు. కల్కి 2 జూన్ నుంచి ఉండొచ్చని నిర్మాత అశ్వినిదత్ అన్నారు కానీ ఖచ్చితంగా అని చెప్పలేదు. సో స్పిరిట్ తప్ప ఏదీ ఖరారుగా చెప్పలేని పరిస్థితి.

సరే స్పిరిట్ అయ్యాక సందీప్ రెడ్డి వంగా ఎవరితో చేస్తాడనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. హఠాత్తుగా రామ్ చరణ్ పేరు తెరమీదకు వచ్చింది. బుచ్చిబాబు, సుకుమార్ తర్వాత ఈ కలయిక జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇక్కడో ట్విస్టు ఉంది.

టి సిరీస్ భాగస్వామ్యంలో సందీప్ వంగా మొన్నటి ఏడాదే ఒక ప్రాజెక్టుకి అఫీషియల్ గా లాకయ్యాడు. అల్లు అర్జున్ హీరోగా ప్రకటన కూడా ఇచ్చారు. పుష్ప 2 చేసిన ర్యాంపేజ్ చూశాక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్యాన్ ఇండియా మూవీని వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. సో బన్నీ – త్రివిక్రమ్ తర్వాత ఇది ఆశించవచ్చు.

ఒకవేళ రామ్ చరణ్ తో సందీప్ వంగా కనక సినిమా ప్లాన్ చేస్తే అది 2027 లేదా ఆపై ఏడాది తప్ప అంతకన్నా ముందు ఉండే ఛాన్స్ లేదు. స్టార్ హీరోలకు ఒక ఇబ్బందుంది. ప్రభాస్ లాగా అందరూ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయలేకపోతున్నారు. దీని వల్ల స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ సైతం ఇబ్బందులకు గురవుతోంది.

సో ప్రస్తుతం స్పిరిట్ తప్ప సందీప్ వంగాకు మరో ప్రపంచం లేదు. ఎంతలేదన్నా రిలీజ్ కు ఏడాదిన్నర పైగానే పడుతుంది. మిగిలినవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. అన్నట్టు చిరంజీవితో కూడా సందీప్ ఒక సినిమా చేస్తాడనే టాక్ ఉంది కానీ ఒకవేళ ఇది కూడా ఉంటే ఫ్యాన్స్ కి పండగే.