Movie News

సంక్రాంతికి ఇంకో ‘పాత’ సినిమా

గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ డైరెక్టర్లలో ఒకడు. యాక్షన్ కథలను, లవ్ స్టోరీలను అద్భుతంగా ప్రెజెంట్ చేయగల నైపుణ్యం ఆయన సొంతం. చెలి, ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి ప్రేమకథలను ఎంత హృద్యంగా తీశాడో.. కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి యాక్షన్ కథలను అంత పకడ్బందీగా తీసి తన ప్రత్యేకతను చాటాడు గౌతమ్.

ఐతే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో యాక్సన్ మూవీ ‘ధృవ నక్షత్రం’ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. గౌతమ్‌కు చెందిన ఫాంటన్ ఫిలిమ్స్ ఆర్థిక వివాదాల్లో చిక్కుకోవడమే అందుక్కారణం. దీని వల్ల ఆయన వేరే సినిమాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. ఐతే వాటిలో ఒక్కోదాన్ని బయటికి తీసుకురాగలిగాడు కానీ.. ‘ధృవనక్షత్రం’ సంగతే ఎటూ తేలకుండా పోయింది.

కొన్నేళ్ల పాటు అసలు వార్తల్లో లేని ఈ చిత్రాన్ని గత ఏడాది నవంబరు 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు గౌతమ్. కానీ అది సాధ్యపడలేదు. సినిమా చుట్టూ ముసురుకున్న ఆర్థిక వివాదాలు పరిష్కారం కాక అప్పుడు సినిమా రిలీజ్ కాలేదు. ఇక ఈ సినిమా బయటికి రావడం కష్టమే అని అందరూ ఫిక్సయ్యారు. కానీ ఇప్పుడు గౌతమ్ మళ్లీ ఈ చిత్రాన్ని వార్తల్లోకి తీసుకొచ్చాడు. ఇంతకుముందు ప్రకటించినట్లే సినిమాకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ‘ధృవ నక్షత్రం’ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ పండక్కి తమిళంలో విక్రమ్ నుంచే ‘వీర ధీర సూరన్’ సినిమా రావాల్సింది. కానీ అది వాయిదా పడింది. అలాగే అజిత్ మూవీ ‘విడాముయర్చి’ సైతం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. దీంతో తమిళంలో పొంగల్ కళ తప్పింది. ఈ పండక్కి దశాబ్దం కిందటి విశాల్ సినిమా ‘మదగజరాజా’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ధృవనక్షత్రం’ రూపంలో మరో పాత సినిమా పోటీలోకి వచ్చింది. ఐతే ‘ధృవనక్షత్రం’ విషయంలో ఇంతకుముందు జరిగింది దృష్టిలో ఉంచుకుని చూస్తే 11న థియేటర్లో బొమ్మ పడే వరకు గ్యారెంటీ లేనట్లే.

This post was last modified on January 8, 2025 10:46 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago