శంకర్ & సుకుమార్ చెప్పారంటే మాటలా

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం వల్ల వెంటనే లైవ్ చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు కానీ ఇండియాలో ఉన్న మూవీ లవర్స్ వెంటనే ఆస్వాదించలేకపోయారు. ఎట్టకేలకు శాటిలైట్ ఛానల్ లో దీన్ని ప్రసారం చేయడంతో వేడుక తాలూకు విశేషాలు తెలుసుకునే ఛాన్స్ దొరికింది. ముఖ్యంగా ఈ ప్యాన్ ఇండియా మూవీ దర్శకుడు శంకర్, సుకుమార్ మాటలు వింటే అంచనాలకు అడ్డుకట్ట వేయడం కష్టమనేలా ఉన్నాయి. రంగస్థలంతో వస్తుందనుకున్న జాతీయ అవార్డు ఈసారి చరణ్ గేమ్ ఛేంజర్ తో కొట్టేస్తాడని సుక్కు చెప్పడం నిజాయితీగా అనిపించింది.

శంకర్ మరోసారి చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి వివరిస్తూ డాన్స్, ఎమోషన్స్, యాక్షన్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో మెగా పవర్ స్టార్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ చాలా బాగుందని, థియేటర్లలో చూసి మీరే ఒప్పుకుంటారని చెప్పడం చప్పట్లతో హోరెత్తిపోయేలా చేసింది. పాటల్లో చరణ్, కియారా అద్వానీ ఎవరిని చూడాలో కన్ఫ్యూజ్ అయ్యేంత గొప్పగా జోడి కుదిరిందని కితాబు ఇచ్చారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక అవినీతి రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే గేమ్ ఛేంజరని చెప్పుకొచ్చారు. పంచకట్టులో ఉండే అప్పన్న గెటప్, గెడ్డంతో కనిపించే కాలేజీ ఎపిసోడ్స్ గురించి కాసిన్ని ముచ్చట్లు ప్రత్యేకంగా చెప్పారు.