రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. సోషల్ మీడియాలో అందరి దృష్టి ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు పుష్ప 2 పోస్టులు రప్పా.. రప్పా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అసలు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే పుష్ప న్యూసే కనిపించేది. అయితే సడెన్‌గా సీన్‌లోకి మంచు ఫ్యామిలీ గొడవలు… నాగబాబుకు మంత్రి పదవులు ఎంటర్ అయ్యాయి. నాగబాబుకు మంత్రి పదవి ఏంటన్న దానిపై రాజకీయంగా రకరకాల చర్చలకు కారణమయ్యాయి. చాలా మంది నమ్మలేదు.. చివరకు అందరూ షాక్‌లోకి వెళ్లారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి వార్త కూడా వెనక్కు వెళ్లిపోయి ఆ ప్లేస్‌లోకి మంచు కుటుంబం గొడవ ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసింది.
అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు… మంచు కుటుంబం గొడవ.. మనోజ్‌ను మోహన్‌బాబు కొట్టాడని.. కాదు మనోజే మోహన్‌బాబును తోశాడని.. విష్ణు దుబాయ్‌లో ఉంటున్నాడని.. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని.. మంచు లక్ష్మీ ప్రసన్న ఎవరి వైపు… మధ్యలో వినయ్ అనే వ్యక్తి ఎవరు ? ఇలా రకరకాల వార్తలు మంచు ఫ్యామిలీ వార్ విషయంలో బాగా హైలెట్ అయ్యాయి. వాస్తవంలోకి వస్తే మంచు మోహన్‌బాబుకు… రెండో కుమారుడు మంచు మనోజ్‌కు మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది.
ఆస్తుల మేనేజ్‌మెంట్ విషయాలతో పాటు మనోజ్.. మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం మోహన్‌బాబు ఫ్యామిలీకి ఎంత మాత్రం ఇష్టంలేదు. అక్కడ నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. రోజురోజుకు అవి పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గలేదు. అవి చినికి చినికి గాలివానలా మారి.. అందరూ రోడ్డెక్కే వరకు వచ్చింది. వాస్తవానికి నాగబాబుకు మంత్రి పదవి అనగానే.. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు అన్న టాక్‌తో పాటు గతంలో నాగబాబు చేసిన వీడియోలను ఆయనంటే గిట్టని వారు వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ట్రెండింగ్‌లో ఉన్న నాగబాబు, పుష్ప 2 సినిమాలు మంచు ఫ్యామిలీ వార్ ఎఫెక్ట్‌తో ఇది ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates