2019లో గిరీష్ జి దర్శకత్వం తెరకెక్కిన కన్నడ మూవీ ఓంధ్ కథే హెల్లాలో ప్రియాంక అరుల్ మోహన్ తన సినీ కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరం నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయన్ డాక్టర్ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. తాజాగా కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం చిత్రాలలో నటించి అందరినీ మెప్పించింది.