డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ తో కలిసి రష్మిక తీసుకున్న ఫోటో వైరల్ అవుతుంది. పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రకు జీవం పోసిన రష్మిక, ఈ పోస్టులో చిత్రంపై తనకున్న అనుబంధాన్ని ఎంతో భావోద్వేగంతో వివరించారు.
ఇందులో జాతర సీన్ కి సంబంధించి పెద్దగా మేకప్ లేకుండా సుకుమార్తో కలిసి కూర్చొని నవ్వుతున్న అల్లు అర్జున్ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇక ఫీలింగ్స్ పాటలో రష్మిక ఓ రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి అందరి మైండ్ బ్లాక్ చేసింది. అల్లు అర్జున్ పవర్ఫుల్ మాస్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ మరో పక్క క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ పాటకు జీవం పోసింది రష్మిక.
ఇక ఈ పోస్టులో ఆమె శ్రీవల్లి పాత్ర కోసం చిత్తూరు యాస నేర్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడిందో కూడా మెన్షన్ చేసింది. ఈరోజు విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకు వెళ్తుంది..ఈ మూవీ ఆమె కెరీర్ లో మరొక మైలురాయిగా నిలుస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు.
ఈ మూవీ కు సీక్వెల్ గా పుష్ప 3 తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇందులో శ్రీవల్లి పాత్ర మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది అన్న టాక్ నడుస్తోంది. ఈ మూవీ తర్వాత రష్మిక యానిమల్ పార్క్,కుబేరుడు, చావా,సికిందర్.. ఇలా వరుస సినిమాలతో సందడి చేయనుంది.