పెళ్లి ఫోటోస్ :- నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల వైభవమైన వివాహం!

అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, అక్కినేని కుటుంబ సన్నిహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అక్కినేని కుటుంబానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చిన లెజెండరీ యాక్టర్.. ఏఎన్ఆర్ గారి జ్ఞాపకార్థం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు అదే లెగసీని కంటిన్యూ చేస్తున్న అక్కినేని కుటుంబం ఆయన ఆశీర్వాదం కొత్త జంటకు అందాలి అనే ఉద్దేశంతో అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఆయన విగ్రహం సమక్షంలో ఈ ఇద్దరి పెళ్లి నిర్వహిస్తోంది.