ఆరుపదుల వయసులో కుర్ర హీరోలకు కంగారు పుట్టిస్తున్న చిరు…

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తరువాత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చిరు ఇప్పటి కుర్రాళ్లకు పోటీ ఇచ్చేలా తయారవుతున్నారు. గత ఏడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టించిన మెగాస్టార్ త్వరలో విశ్వంభరా అనే సోషో ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ మూవీ తర్వాత సుస్మిత కొణిదల నిర్మాణంలో మరొకచిత్రం చేయనున్నారు చిరంజీవి. ఇక తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక మూవీని ప్రకటించారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి తో ఓ కామెడీ ఎంటర్టైనర్ ఉండనే ఉంది. ఇలా భారీ లైన్ తో చిరు ఫుల్ బిజీగా ఉన్నారు.