తెల్ల చీరలో హంస వలె కవ్విస్తున్న కిస్సిక్ పాప..

మొన్న సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం చిత్రంతో హాట్ మిర్చిలా యువత మదిలో ఘాటు రేపింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ తో పాటు నితిన్ రాబిన్‌హుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది. తాజాగా పుష్ప 2 లో అల్లు అర్జున్ తో కలిసి స్పెషల్ సాంగ్ కిస్సిక్ తో మాస్ మానియా సృష్టించింది.

చెన్నైలో జరిగిన పుష్ప 2 “కిస్సిక్” ఈవెంట్‌ కు హాజరైన శ్రీ లీల.. వైట్ సారీ తో అందరిని మెస్మరైజ్ చేసింది. సెల్ఫ్ సీక్వెల్ ఎంబ్రాయిడరీ చేసిన వైట్ సారీ, స్టోన్ వర్క్ చేసిన స్లీవ్ లెస్ బ్లౌస్.. సారీ కి సెట్ అయ్యే విధంగా పెద్ద కమ్మలు, బ్యాంగిల్స్ తో శ్రీ లీల రాజహంసలా ఉంది. ఇక ఈ సారీ తో శ్రీ లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో స్వచ్ఛమైన ఆమె చిరునవ్వు అందరిని ఆకట్టుకుంటుంది.