నిన్న జరిగిన ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ ఒక షాక్ ఇచ్చాడు. ఆల్బమ్ లో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నాయని, రిలీజ్ చేయగా మిగిలిన ఏడు సాంగ్స్ ఆడియో జ్యుక్ బాక్స్ రూపంలో ఇవాళ విడుదల చేస్తామని చెప్పాడు. ఇది విని దగ్గుబాటి అభిమానులు షాకయ్యారు. ఎందుకంటే ముందు వచ్చిన నారాయణమ్మ రీమిక్స్ టైపు కాబట్టి అంత సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత మాలా మీద నెగటివ్ ఫీడ్ బ్యాకే ఎక్కువ వచ్చింది. ట్రైలర్ వచ్చి అంచనాలు రేపింది కానీ లేదంటే సీన్ వేరుగా ఉండేది.
ఇలాంటి పెద్ద సినిమాకు బజ్ పెంచే క్రమంలో పాటలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో చెప్పనక్కర్లేదు. అలాంటప్పుడు అన్నేసి పాటలు పెట్టుకుని ఎందుకు దాచి పెట్టారనేది అంతు చిక్కని ప్రశ్న. దాంట్లో ఏవైనా మంచి క్యాచీగా ఉండేవి ఈ పాటికి వైరల్ అయ్యేవిగా. కేవలం రెండు రోజుల ముందు రిలీజ్ చేయడం ఏమిటనేది మ్యూజిక్ లవర్స్ ప్రశ్న. అన్నీ ఫుల్ లెన్త్ కాకపోవచ్చు. కొన్ని బిట్ సాంగ్స్ కూడా ఉండొచ్చు. అంతమాత్రాన ఆలస్యం చేయడం ఏ కోణంలో చూసినా రైట్ కాదు.
బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబంకు పెద్ద సవాళ్ళే ఉన్నాయి. ఒకపక్క ఆంధ్ర వైపు అర్ణబ్ తుఫాను అరాచకం చేస్తోంది. పరిస్థితి మాములుగా మారి జనం థియేటర్లకు అంత ఈజీగా వచ్చేలా లేరు. తెలంగాణ, రాయలసీమలో పెద్దగా ఆందోళన చెందే వర్షాలు లేకపోవడం మహా ఊరట. కంటెంట్ పరంగా విపరీతమైన హైప్ తెచ్చుకోవడంలో వెనుకబడిన ఆదర్శ కుటుంబం మీద మెల్లగా బజ్ పెరుగుతోంది. రిలీజ్ రోజు నాటికి ఇది పీక్స్ కు వెళ్తే భారీ ఓపెనింగ్స్ వస్తాయి.
ఒకవేళ తమన్ చెప్పినట్టు మిగిలిన పాటలు ఇంకా బాగుంటే అది ఎంత పెద్ద అడ్వాంటేజ్ అవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. అదేదో ముందే చేసి ఉంటే బాగుండేది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఆదర్శ కుటుంబం ఏకె 47లో నివేత పేతురాజ్ ఒక స్పెషల్ రోల్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన ఎలివేషన్లు చూస్తుంటే ఫ్యామిలీస్ తో పాటు మాస్ కూడా ఎంజాయ్ చేసేలా సినిమా వచ్చినట్టు అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. ఏ క్షణమైనా ఉండొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates