Movie News

15న ఇండియాలో ‘టెనెట్’ రిలీజవుతుందా?

ఈ నెల 15న దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఐతే థియేటర్లు తెరుస్తాం కానీ.. ఆడించడానికి సినిమాలేవీ అంటున్నారు ఎగ్జిబిటర్లు. పాత సినిమాలు విడుదల చేసినా ఫలితం ఉండదు. కొత్తవి చూస్తే పేరున్నవి ఏవీ రిలీజయ్యేలా కనిపించడం లేదు.

హౌస్ ఫుల్ అయినా సరే.. సగం రెవెన్యూ వచ్చే పరిస్థితుల్లో ఎవరు ధైర్యం చేసి తమ సినిమాను రిలీజ్ చేస్తారు..? చేజేతులా చంపుకుంటారు..? ఈ నేపథ్యంలో థియేటర్లు తెరుస్తున్నారంటే తెరుస్తున్నారు అన్నట్లే ఉంది పరిస్థిితి. ఇండియాలో ఏ ఇండస్ట్రీలో కూడా కొత్త సినిమాల విడుదలకు నిర్మాతలు సుముఖంగా కనిపించట్లేదు. మరి థియేటర్ల పున:ప్రారంభం కోసం గట్టిగా డిమాండ్ చేసిన మల్టీప్లెక్స్ ఛైన్స్ ఏం చేస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

భారతీయ సినిమాల మీద పెద్దగా ఆశ లేదు కానీ.. హాలీవుడ్ సినిమాలను ప్రదర్శించడం గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నది క్రిస్టోఫర్ నోలన్ సినిమా ‘టెనెట్’. ఈ చిత్రం రెండు నెలల కిందటే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా బాగుందని టాక్ వచ్చినా కరోనా పరిస్థితుల వల్లే దాని వసూళ్లు దెబ్బ తిన్నాయి.

ఇండియాలో ఈ సినిమాకు మంచి ఆదరణే దక్కుతుందని ఆశతో ఉన్నారు. కాకపోతే రెవెన్యూ షేర్ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ పెడుతున్న షరతుల వల్ల పీఠముడి పడ్డట్లు సమాచారం. మామూలుగా హాలీవుడ్ సినిమాలను 50-50 రెవెన్యూ పంచుకునేలా నిర్మాణ సంస్థలు ఇతర దేశాల్లో విడుదల చేస్తాయి.

ఐతే ‘టెనెట్’ మీద భారీ పెట్టుబడి పెట్టడం, సినిమాల ప్రదర్శనకు అంతగా అనుకూలంగా లేని పరిస్థితుల్లో రిస్క్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు వార్నర్ బ్రదర్స్ తమకు 65 శాతం షేర్ కోరుతోంది. వివిధ దేశాల్లో అలాగే రిలీజ్ చేసింది. ఐతే 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేస్తూ, శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ లాంటి వాటికి ఖర్చు పెడుతూ.. నిర్మాణ సంస్థకు 65 శాతం, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ల షేర్ ఇచ్చి తమకు మిగిలేదముంటుంది అంటున్నాయి మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు. దీనిపై చర్చలు ఎంతకీ తెగట్లేదట. దీనికి తోడు ఢిల్లీ, మహారాష్ట్రల్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కూడా లేకపోవడంతో 15న ‘టెనెట్’ ఇండియాలో రిలీజ్ కావడం సందేహమే అంటున్నారు.

This post was last modified on October 7, 2020 3:09 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

41 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago