ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే తదుపరి సిఎం అభ్యర్ధిగా ఏఐఏడిఎంకే నిర్ణయించింది. బుధవారం ఉదయం జరిగిన పార్టీ కీలక సమావేశంలో సభ్యులందరు ఈ మేరకు నిర్ణయించి ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా ఏఐఏడిఎంకే తరపున రానున్న ఎన్నికల్లో సిఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. కొంతకాలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ. పన్నీర్ సెల్వం తమిళనాడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. దాంతో ప్రస్తుత సిఎం పళనిస్వామికి ఒళ్ళుమండిపోయింది. దాంతో ఇద్దరి మధ్యే కాకుండా వాళ్ళ వర్గాల మధ్య కూడా పెద్ద గొడవలే అవుతున్నాయి.
వీళ్ళ గొడవలు ఇలాగుంటే డిఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలినే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధంటు డిఎంకే ఈ మధ్య ప్రకటించింది. స్టాలిన్ విషయంలో ఎవరికీ ఎటువంటి రెండో అభిప్రాయం లేకపోవటంతో స్టాలిన్ నాయకత్వానికి పార్టీ ఎంఎల్ఏలు, నేతలంతా జై కొట్టారు. కాబట్టి డిఎంకే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. ఇక మిగిలింది దినకరన్ నేతృత్వంలోని కూటమి మాత్రమే. వీళ్ళు పార్టీ కీలక నేత శశికళ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఆమెమే కర్నాటకలోని పరప్పన జైలులో ఉన్నారు. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ముగించుకుని తొందరలోనే విడుదల అవుతారని అందరు అనుకుంటున్నారు.
ఒకవేళ ఆమె గనుక విడుదలైతే వేరు కుంపటి పెట్టుకుంటుందా ? లేకపోతే ఏఐఏడిఎంకే తమదే అంటూ మొదలు పెడుతా అన్నది చూడాలి. ఒకవేళ ఆమే గనుక ప్రస్తుత అధికారపార్టీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఏఐఏడిఎంకేలోని ఎంతమంది ఎంఎల్ఏలు, నేతలు పార్టీని వీడి ఆమెవైపు వెళిపోతారన్నది సస్పెన్సుగా మారింది. ఎందుకంటే ఓ పన్నీర్ సెల్వం అయినా పళని స్వామికైనా ఒంటిచేత్తో పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఉందని ఎవరు అనుకోవటం లేదు. అప్పట్లో జయలిలత పుణ్యామని పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత ఇద్దరు సిఎంలు అవ్వగలిగారు.
ఏదేమైనా 2021లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డిఎంకే మాత్రమే వ్యవస్ధాగతంగా బలమైన పార్టీగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు ఏదో ఓ పార్టీకి తోకపార్టీలుగా మాత్రమే ఉండాలి. ఇదే సమయంలో తమిళనాడులోనే పిఎంకే, ఎండిఎంకే లాంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలున్నా అవన్నీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే ప్రస్తుతానికి అనిపిస్తోంది. సరే ప్రస్తుతానికైతే అధికారపార్టీ తరపున మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పళనిస్వామినే ఎన్నుకున్నారు కాబట్టి పార్టీలో పెద్ద వివాదం పరిష్కారమైనట్లే అనుకోవాలి.
This post was last modified on October 7, 2020 2:48 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…