Movie News

సింగిల్ స్క్రీన్లు చచ్చినట్లే..

కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బ తిన్నవే. అందులోనూ సినీ రంగంపై పడ్డ ప్రభావం అలాంటిలాంటిది కాదు. ముఖ్యంగా సినీ రంగానికి ప్రాణవాయువు అనదగ్గ థియేటర్ ఇండస్ట్రీ కరోనా దెబ్బకు దారుణంగా దెబ్బ తింది. ఏడు నెలల పాటు థియేటర్లు మూతపడి వాటిని నమ్ముకున్న లక్షలాది మంది రోడ్ల మీదికి వచ్చేశారు. వాళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది.

కానీ థియేటర్లు నడిపించడానికి పెట్టిన షరతులు చూసి యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే కొత్త సినిమాలు లేవు. పైగా 50 శాతం కెపాసిటీతో నడిపించాలి. ప్రతి షోకు ముందు థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయించాలి. ఎక్కడికక్కడ థర్మల్ శానిటైజర్లు పెట్టాలి. థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. ఇన్ని చేసినా జనాలు థియేటర్లకు ఏమాత్రం వచ్చి సినిమాలు చూస్తారన్నది అర్థం కావడం లేదు. అన్నింటికీ మించి వాళ్లను ఆకర్షించే పేరున్న కొత్త సినిమాలు రిలీజవుతాయా అన్నది ప్రశ్న.

మల్టీప్లెక్స్‌లను నడిపించే వాళ్ల స్థాయి వేరు. వాటిని తెరవడం, నామమాత్రంగా అయినా నడిపించడం అనివార్యం. కనీసం ఇంగ్లిష్ సినిమాలైనా ఏవైనా వేసి నడిపిస్తారు. కానీ సింగిల్ స్క్రీన్ల పరిస్థితే అయోమయంగా ఉంది. అక్కడ ఆడించే సినిమాలు ఇప్పట్లో రిలీజయ్యే అవకాశం లేదు. ఆ థియేటర్లను ప్రభుత్వం చెప్పిన పద్ధతిలో నడిపించడం చాలా కష్టం. పైగా అవి లీజుల్లో ఉంటాయి. వాళ్లు అంత బాధ్యత తీసుకుని షరతుల ప్రకారం థియేటర్లు నడిపిస్తారా అన్నది డౌటు. వీటిలో కరోనా నిబంధనలు పాటించడం, వాటిని మానిటర్ చేయడం అన్నది అంత తేలికైన విషయం కాదు.

ఇదిలా ఉంటే.. సింగిల్ స్క్రీన్లను మరింత ఇబ్బందికి గురి చేసే షరతు ఒకటి పెట్టారు. టికెట్లను కౌంటర్ దగ్గర అమ్మకూడదట. ఆన్ లైన్లోనే అమ్మకాలు చేపట్టాలట. బి, సి సెంటర్లలో చాలా థియేటర్లకు ఈ సౌలభ్యం లేదు. అసలు థియేటర్లు నడుస్తాయో లేదో తెలియకుండా ఇప్పటికిప్పుడు ఆన్ లైన్ టికెటింగ్‌లోకి వెళ్తారని అనుకోలేం. ఇక క్యాంటీన్లో అమ్మకాలపైనా షరతులున్నాయి.

కరోనాకు ముందే సింగిల్ స్క్రీన్ల పరిస్థితి ఏమంత బాగా లేదు. వైరస్ దెబ్బకు వాటి మనుగడే ప్రశ్నార్థకం అయింది. వాటిలో పని చేసేవాళ్లు చెల్లాచెదురైపోయారు. ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి జీతాలిస్తారో లేదో తెలియని స్థితిలో పని చేయించడం అంత తేలిక కాదు. ఈ పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్లను పూర్తిగా చంపేసేలా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు.

This post was last modified on October 7, 2020 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణలో దారుణం.. పట్టపగలే కత్తితో పొడిచి..

తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…

24 minutes ago

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి…

43 minutes ago

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

1 hour ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

1 hour ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

3 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

3 hours ago