తాజాగా ఆమె పింక్ కలర్ సారీ లో పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ట్రెడిషనల్ బ్యూటీ అంటూ లావణ్య అని నెటిజన్లు తెగ పోగడేస్తున్నారు. ఇక ఈ ఫోటోషూట్ కి సారీ సో పింక్.. అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. పీచ్ పింక్ మధ్యషేడ్ లో ఉన్న సారీ పై వైట్ స్టోన్ వర్క్ మంచి రాయల్ లుక్ ఇస్తోంది. మినిమం మేకప్ లుక్ తో, వైట్ రోజ్ బన్ తో లావణ్య ఈ చీరలో దివి నుంచి దిగిన అతిలోకసుందరిలా ఉంది.