మన సీనియర్ స్టార్లను ఎందుకు ప్రశ్నించాలి

జైలర్ 2 సక్సెస్ తర్వాత సోషల్ మీడియా యువతకు ఒక పెద్ద సందేహం వస్తోంది. మన సీనియర్లు కూడా ఇలా ముత్తువేల్ పాండియన్ లాగా తాత పాత్రలు పోషిస్తూ, సెటిల్డ్ ఎలివేషన్లతో సినిమాలు చేస్తే బాగుంటుంది కదాని. ఇంకా పాత ఫార్ములాలు వాడుతూ రెగ్యులర్ గా వెళ్లడం భావ్యమానేది వాళ్ళ కంప్లయింట్. ఒకరకంగా చెప్పాలంటే రజనితో పోలుస్తూ చిరంజీవిని తక్కువ చేస్తున్న వైనం ట్విట్టర్ లో గమనించవచ్చు. అసలు వాళ్ళను ఎందుకు ప్రశ్నించే అవసరం రాదో చూద్దాం.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇలా నాలుగు బాషల ఆడియన్స్ అభిరుచులు వేరు. హీరోలను రిసీవ్ చేసుకునే విధానం, ఆరాధించే పద్ధతి కూడా వేరు. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ మనల్ని ఎంటర్ టైన్ చేస్తూ వచ్చిన పద్దతి వేరు. రజనీకాంత్ ఫాలో అయిన స్టయిల్ వేరు. మన ఆడియన్స్ కి డాన్సులు, ఫైట్లు, విలన్లతో సవాళ్లు అన్నీ కావాలి. అఖండలో బాలయ్య ఇంటెన్స్ పెర్ఫార్మన్స్, వాల్తేరు వీరయ్యలో చిరు వింటేజ్ నటన, సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ కామెడీ టైమింగ్ ఇవన్నీ లేకుండా వీళ్ళను ఒప్పుకోగలమా.

కోలీవుడ్ కేసు వేరు. కేవలం నడక స్టైల్ తో రజని ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. నల్లగా ఉన్న విజయ్ కాంత్ అపారమైన ఆదరణ దక్కించుకున్నారు. చూసేందుకు వెరైటీగా అనిపించే యోగిబాబు హీరోగా ఇప్పటికే చాల సినిమాలొచ్చాయి. కమెడియన్ సూరి మెల్లగా మెయిన్ లీగ్ లోకి వెళ్తున్నాడు. మల్లువుడ్ లో చూసుకుంటే వాళ్ళ రిసీవింగ్ పద్దతి వేరు. ఇంగ్లీష్ టైటిల్స్, మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్, పోలీస్ క్రైమ్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అవన్నీ మనదగ్గర ప్రతిసారి చెల్లవు.

ఓపిక తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా హీరోలే స్పీడ్ తగ్గిస్తారు. కాకా, దాదా, కింగ్ అంటూ మన హీరోలు ఇంకా యాక్టివ్ గా హుషారుగా నటిస్తూ ఉన్నప్పుడు మీరు మెల్లగా నడవండి, కార్లు తుడుస్తూ యాక్ట్ చేయండి అంటే నిర్మాతలు షెడ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా విశ్లేషించుకోకుండా రజనిని చూసి నేర్చుకోమని చెప్పడం కామెడీ. టాలీవుడ్ స్టార్లు చెప్పులు కుట్టే పాత్రలో నటించారు (స్వయంకృషి), కురూపిగా మెప్పించారు(భైరవద్వీపం), హీరోయిన్ కాళ్ళు ముట్టుకునే సీన్లు(పవిత్రబంధం) చేశారు. అవన్నీ అన్ని భాషల్లో అందరు చేసేవి కాదు. మనకు మాత్రమే సాధ్యమైనవి.