టైగర్ హుకుమ్ పరుగు ఎక్కడిదాకా

మొదటి రోజు కొంచెం మిక్స్డ్ టాక్ తో మొదలైన జైలర్ 2 అనూహ్యంగా పుంజుకుని ట్రేడ్ మతులు పోగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రెండో వారంలో అడుగు పెట్టేలోపే నాలుగు వందల కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన ముత్తువేల్ పాండియన్ ఇప్పుడు అరటన్ను మీద టార్గెట్ పెట్టుకున్నారు. ఇది చాలా సులభం. ఇంకా సెలవులు మూడు రోజులున్నాయి. తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ముఖ్యంగా తమిళనాడు ర్యాంపేజ్ చూస్తుంటే అరాచకం అనే మాట చాలా చిన్నదే అనిపిస్తుంది.

ఏపీ తెలంగాణలో జైలర్ 2 బలంగానే ఉంది. రణబాలి పోటీతో రెండు నువ్వా నేనా అనేలా వసూళ్లు రాబడుతున్నాయి. టాక్స్ పక్కనపెడితే సెలవుల సీజన్ ఇక్కడ బాగా కలిసి వస్తోంది. ప్రేక్షకులకు ఈ రెండు తప్ప మార్కెట్ లో వేరే ఆప్షన్ లేదు. గరివిడి లక్ష్మికి డీసెంట్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ అది కొన్ని ఏరియాలకే పరిమితమవుతోంది. క్రేజీ కళ్యాణంకు ఆశించినంత స్పందన లేకపోవడంతో వసూళ్లు ఆశాజనకంగా లేవు. సోలోగా వచ్చి ఉంటే ఏమయ్యేదో కానీ కాంపిటీషన్ లో నలిగిపోయింది.

ఇక జైలర్ 2 విషయానికి వస్తే ఇప్పుడప్పుడే స్లో అయ్యేలా లేదు. గురువారంతో హాలిడేస్ పూర్తవుతాయి. ఆ వెంటనే మరో వీకెండ్ వస్తుంది కనక బయ్యర్లు ఎలాంటి ఆందోళన చెందడం లేదు. కాకపోతే ఆక్యుపెన్సీలు అమాంతం డ్రాప్ కాకుంటే చాలని కోరుకుంటున్నారు. జైలర్ మొదటి భాగానికి వచ్చినంత భీభత్సమైన ఫీడ్ బ్యాక్ జైలర్ 2కి రానప్పటికీ మన జనాలకు కంటెంట్ కనెక్ట్ అయిపోయింది. స్టయిల్, స్వాగ్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్లతో పైసా వసూలు అనుకుని సంతృప్తి చెందారు.

కూలి నిరాశ పరిచిన తర్వాత జైలర్ 2 ఇంత రికార్డులు దక్కించుకోవడం విశేషమే. ఇదంతా తర్వాత రాబోయే రజనీకాంత్ నెక్స్ట్ మూవీ ధర్మన్ కు చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ బిజినెస్ ఎంక్వయిరీలు క్రేజీగా ఉన్నాయట. రామ్, శ్రీలీల లాంటి యంగ్ క్యాస్టింగ్ కూడా ఉండటంతో పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తున్నాయట. అయితే టీజర్ వచ్చేదాకా నిర్మాతలు ఎలాంటి డీల్స్ క్లోజ్ చేసే ఉద్దేశంలో లేరని చెన్నై వర్గాల కథనం. మొత్తానికి జైలర్ 2 ప్రభావం సూపర్ స్టార్ మార్కెట్ మీద చాలా పాజిటివ్ గా పడింది.