సౌభాగ్య శ్రావ‌ణం.. ‘హితోక్తి’తో సాకారం!

— జూలై 25 నుంచి ప‌విత్ర శ్రావ‌ణ మాసం ప్రారంభం
— శ్రావ‌ణంలో ప్ర‌తి మంగ‌ళ‌, శుక్ర‌వారాలు ముత్త‌యిదువుల‌కు ప‌విత్ర‌మే
— ఆగ‌స్టు 8న స‌ల‌క ఐశ్వ‌ర్యాల‌ను ఇచ్చే వ‌ర‌లక్ష్మీ వ్ర‌తం
హితోక్తి ఆన్‌లైన్ మాధ్య‌మం ద్వారా పూజ‌ల‌కు నేడే బుక్ చేసుకోండి!
— Hithokthi.com ద్వారా లేదా, వాట్సాప్ నెంబ‌రు +91 8367775522 ద్వారా స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు

భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్ఠ‌త ఉంటుంది. ముఖ్యంగా మ‌హిళ‌లు అత్యంత ప‌విత్రంగా.. భావించే మాసం శ్రావ‌ణ మాసం. చంద్రుడు.. శ్ర‌వ‌ణ న‌క్ష‌త్రంతో క‌లిసి ఉండే మాసం క‌నుక‌.. దీనికి శ్రావ‌ణ మాసం అనే పేరు వ‌చ్చింది. ఈ మాసంలో వ‌చ్చే ప్ర‌తి మంగ‌ళ‌వారం, ప్ర‌తి శుక్ర‌వారం.. అత్యంత ప‌విత్ర‌మ‌న‌వ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయా రోజుల్లో చేసే వ్ర‌తాలు, పూజ‌లు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డ‌మే కాకుండా.. కోరిన కోరిక‌లు సైతం నెర‌వేరుస్తాయ‌న్న‌ది పండితుల మాట‌. మ‌రీ ముఖ్యంగా శ్రావణ మాసం మ‌హిళ‌ల‌కు మ‌రింత ప‌విత్రం. ఈ నెల‌… ప‌విత్ర‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తంతో పాటు అనేక పండుగ‌ల‌కు నెల‌వుకావ‌డం విశేషం.

8న వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం!
మ‌హిళ‌లు అత్యంత ప‌విత్రంగా భావించేది.. సౌభాగ్యం. భ‌ర్త‌, పిల్ల‌లు, కుటుంబం క‌లకాలం చ‌ల్ల‌గా ఉండాల‌ని వారు కోరుకుంటారు. ప‌సుపు కుంకుమ‌ల‌తో తాము కళ‌క‌ళ‌లాడాల‌ని భావిస్తారు. ఈ క్ర‌మంలోనే.. శ్రావ‌ణ‌మాసంలో వ‌చ్చే రెండో శుక్ర‌వారంనాడు.. వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తాన్ని అత్యంత ప‌విత్రంగా చ‌రిస్తారు. అయితే.. ఈ రోజు కుద‌రని వారు.. ఈ మాసంలో వ‌చ్చే ఏ శుక్ర‌వారం నాడైనా..ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించుకోవ‌చ్చు. ఏ వారం ఆచ‌రించుకున్నా మ‌న‌సు, త‌నువు ప‌విత్రంగా ల‌క్ష్మీదేవిని కొలుచుకుంటే.. వ‌చ్చే ఫ‌లం ఒక‌టేన‌ని పండితులు చెబుతారు. కాబ‌ట్టి.. రెండో శుక్ర‌వార‌మే కాకుండా.. మ‌హిళ‌ల‌కు కుదిరిన శుక్ర‌వారం నాడు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం స‌హా.. ఇత‌ర వ్ర‌తాలు, పూజ‌లు చేసుకోవ‌చ్చు.

ఎన్నారైల కోసం.. హితోక్తి

స్వ‌దేశాన్ని వ‌దిలి.. ఇత‌ర దేశాల్లో ఉద్యోగ‌, వ్యాపాల కోసం వ‌చ్చి.. స్థిర‌ప‌డిన భారతీయ కుటుంబాల కోసం.. హితోక్తి సంస్థ ఎన‌లేని సేవ‌లు చేరువ చేస్తోంది. ప‌విత్ర మాసాల్లో స‌నాత‌న ధ‌ర్మానికి అనుగుణంగా పూజ‌లు, వ్ర‌తాల‌ను ఆన్‌లైన్ విధానంలో చేసుకుని సంతృప్తి పొందేలా.. ఈ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. ఎందుకంటే.. మ‌న‌ది కాని దేశంలో వ్ర‌తాలు, పూజ‌లను శాస్త్రోక్తంగా నిర్వ‌హించుకునేందుకు పండితులు, పూజారుల కొర‌త వెంటాడుతోంది. ముఖ్యంగా తెలుగు వారైన పండితులు, ఆచార్యులు, పూజాలు ల‌భించ‌డం మ‌రింత క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో అలాంటి క‌ష్టాల‌కు ముగింపు ప‌లుకుతూ.. మ‌హిళ‌ల‌కు ఆత్మానందాన్ని.. అందించేలా శాస్త్రోక్తంగా పూజ‌లు చేయించేందుకు హితోక్తి సంస్థ ఎంత‌గానో శ్ర‌మిస్తోంది.

ఏటా శ్రావ‌ణ మాసంలో ప్ర‌తి శుక్ర‌వారం.. వ్ర‌తాలు ఆచ‌రించుకోవాల‌ని భావించే మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ విధానంలో అచ్చ‌తెలుగు సంప్ర‌దాయంలో పూజ‌లు చేయించే పండితుల‌ను హితోక్తి సంస్థ చేరువ చేస్తోంది. గ‌త ఏడాది ఇదే మాసంలో దాదాపు 400 మంది సౌభాగ్య‌వ‌తులైన ముత్త‌యిదువులు.. హితోక్తి ద్వారా వ్ర‌తాలు ఆచ‌రించి.. వ‌ర‌ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హానికి పాత్రుల‌య్యారు. ఇదే ప‌రంప‌ర‌లో ఈ ఏడాది కూడా.. హితోక్తి సంస్థ ఆన్‌లైన్ ద్వారా.. వ్ర‌తాలు, పూజ‌లు చేయించుకునే వారికి ఆహ్వానం ప‌లుకుతోంది. దీని ద్వారా.. మీకు కుదిరిన‌.. న‌చ్చిన శుక్ర‌వారం రోజు.. వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని ఆచ‌రించుకునేందుకు అవ‌కాశం క‌ల‌గ‌నుంది. అయితే.. హితోక్తి ద్వారా వ్ర‌తాలు ఆచ‌రించుకోవాల‌ని భావించే వారు.. ఈ రోజే మీ స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎక్క‌డిది?

పరమేశ్వరుడు.. వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్టు స్కాంద పురాణం పేర్కొంటోంది. స‌క‌ల సౌభాగ్యాల‌కు ప్ర‌తిరూపం ల‌క్ష్మీదేవి. ఆమె సోద‌రుడైన‌.. చంద్రుడు.. శ్ర‌వ‌ణ న‌క్ష‌త్రంతో(ద‌క్ష ప్ర‌జాప‌తి కుమార్తెల‌లో అత్యంత సౌంద‌ర్య‌వ‌తి, భ‌క్తిస‌మ‌న్వితురాలిగా పేరొందింద‌ని శ్ర‌వ‌ణ న‌క్షత్రానికి ప్ర‌తీతి). క‌లిసి ఉన్న మాసం ఆమెకు ఎంతో ఇష్ట‌మని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఏ శుక్ర‌వార‌మైనా.. ల‌క్ష్మీదేవిని కొలుచుకోవ‌చ్చు. అయితే.. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఒక వేళ ఆరోజు కుద‌ర‌క‌పోయినా.. త‌దుప‌రి శుక్ర‌వారాల్లో అయినా.. వ్ర‌తం ఆచ‌రించ‌వ‌చ్చు. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులు మెరుగు ప‌డేందుకు, యువ‌తులు త‌మ‌కు వివాహాలు త్వ‌ర‌గా అయ్యేందుకు, సంప‌ద వృద్ధి చెందేందుకు, కుటుంబ సౌఖ్యం క‌లిగేందుకు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని ఆచ‌రించ‌వ‌చ్చ‌ని..

శ్రావ‌ణ మాసంలో వ‌చ్చే ప‌విత్ర పండుగ‌లు..

— శ్రావ‌ణ మాసం.. ప‌విత్ర‌ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తానికే కాకుండా అనేక పండుగ‌లకు నెల‌వు. ప్ర‌తి శ్రావ‌ణ మంగ‌ళ‌వారం నాడు.. మంగ‌ళ‌గౌరి వ్ర‌తం చేసుకునే అవ‌కాశం ఉంది. గౌరి అంటే.. పార్వ‌తి. అర్థ‌నారీశ్వ‌రి అయిన పార్వ‌తిని కొలుచుకోవాల‌ని అనుకునే వారు శ్రావ‌ణ మాసంలో వ‌చ్చే ప్ర‌తి మంగ‌ళ‌వారం నాడు.. ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించుకోవ‌చ్చు.

— ఈ ఏడాది ఆగ‌స్టు 8, శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం చేసుకునే వారు ఆ క్ర‌తువును చేసుకోవ‌చ్చు. ఈ సారి విష్ఠ‌త ఏమిటంటే.. ఆ రోజు పౌర్ణ‌మి కావ‌డం. ల‌క్ష్మీ దేవికి సోద‌రుడు(ఇద్ద‌రూ పాల స‌ముద్రం నుంచే జ‌నించారని పురాణాలు చెబుతున్నాయి) అయిన చంద్రుడు.. పూర్ణ‌త్వాన్ని క‌లిగి ఉండ‌డంతో మ‌రింత విశేషం.

— అలాగే ఈ నెల‌లో ర‌క్షా బంధ‌న్‌(రాఖీ పౌర్ణ‌మి), శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి, నాగ పంచ‌మి, బ‌ల‌రామ జ‌యంతి, జంధ్యాల పూర్ణిమ‌(య‌జ్ఞొప‌వీతం ఉన్న‌వారు కొత్త‌వి ధ‌రించే రోజు) వంటి ప‌విత్ర పండుగ‌లు ఉన్నాయి.