త్రిష.. ఇలా ఎలా సాధ్యం?

 త్రిష.. ఇలా ఎలా సాధ్యం?

ఒక హీరోయిన్ తనకు కలిసొచ్చిన సమయంలో ఎంతగా ఆధిపత్యం చలాయించినప్పటికీ.. ఆ హవా ఎంతో కాలం కొనసాగదు. ఐదారేళ్లకు మించి టాప్ రేంజిలో కొనసాగడం కష్టం. కొందరు పదేళ్ల పాటు కూడా ఉనికిని చాటుకుంటుంటారు. కానీ అంతకుమించి హీరోయిన్లు హవా సాగించడం కష్టం.

అందులోనూ ఒకసారి ఒక హీరోయిన్‌కు క్రేజ్ తగ్గిందీ అంటే.. మళ్లీ పుంజుకోవడం కష్టం. పడటం అంటూ మొదలయ్యాక అది పూర్తిగా పతనమయ్యే వరకు కొనసాగుతుంది. హీరోల్లాగా దశాబ్దాలు దశాబ్దాలు కొనసాగడం అన్నది హీరోయిన్లకు అసాధ్యం. ఐతే త్రిష మాత్రం ఇందుకు మినహాయింపులాగా కనిపిస్తోంది.

ఒకప్పుడు తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగిన త్రిష.. ఆ తర్వాత లైమ్ లైట్లోంచి వెళ్లిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. క్రేజ్ పడిపోయింది. ఒక టైంలో ఇక రిటైర్మెంటే తరువాయి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వరుణ్ మణియన్ అనే తమిళ నిర్మాతను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోవడానికి కూడా త్రిష రెడీ అయింది. కానీ అతడితో ఎంగేజ్మెంట్ రద్దవడం.. త్రిష కెరీర్ ఊపందుకోవడం ఒకేసారి జరిగాయి. వరుసగా మంచి అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది త్రిష. ప్రస్తుతం త్రిష ఖాతాలో ఆరు సినిమాలుండటం విశేషం.
అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘సామి-2’ గురించే. 14 ఏళ్ల కిందట విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సామి’. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ త్రిషనే కథానాయికగా తీసుకోవడం మాత్రం ఆశ్చర్యమే. దీంతో పాటుగా మోహని.. గర్జనై.. 1818.. శతురంగ వేట్టై-2.. హేయ్ జూడ్.. 96 అనే ఐదు సినిమాల్లో త్రిష కథానాయికగా నటిస్తోంది. 34 ఏళ్ల వయసులో ఒక సౌత్ హీరోయిన్.. ఇంతటి ఊపు చూపించడం అన్నది మామూలు విషయం కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు