Trends

అమెరికా చరిత్రలో తొలిసారి షేక్ హ్యాండ్ లేకుండా సంవాదం షురూ

ప్రపంచాన్ని ప్రభావితం చేసే అమెరికా అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన కీలక ఘట్టం ఒకటి షురూ అయ్యింది. అధ్యక్ష పీఠం కోసం పోటీ పడే అభ్యర్థులు ఇద్దరు ఒకే వేదిక మీద ముఖాముఖిన మాట్లాడుకునే విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యక్రమం తాజాగా మొదలైంది. అమెరికా చరిత్రలో తొలిసారి.. అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండానే చర్చా కార్యక్రమాన్ని షురూ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

అధ్యక్ష ఎన్నికల సందర్భాగా అభ్యర్థులు ఇరువురి మధ్య 90 నిమిషాల పాటు చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా తమ విజన్ ను తెలిపేలా అభ్యర్థులు మాట్లాడతారు. అదే సమయంలో ప్రత్యర్థి చేసే ఆరోపణల్ని.. విమర్శల్ని ఎదుర్కొంటూ స్పందిస్తుంటారు. అధ్యక్ష ఎన్నికల్లో ఈ చర్చా కార్యక్రమం కీలకమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కాకుంటే.. గత ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఈ సంవాదంలో ట్రంప్ ఓటమి పాలయ్యారు. అంచనాలకు భిన్నంగా ఎన్నికల్లో మాత్రం ఆయన ఘన విజయం సాధించారు.

ఇదిలా ఉంటే తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్..డెమొక్రాట్ల అభ్యర్థిగా బైడెన్ లు ముఖాముఖి కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. చర్చలో మొదటి అంశంగా అమెరికా సుప్రీకోర్టు న్యాయమూర్తి ఎంపికలో చోటు చేసుకున్న ఆరోపణలు చర్చకు వచ్చాయి. అమెరికాలో ఎన్నికలు ఇప్పటికే షురూ అయ్యాయని.. ఇప్పటికే వేలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని బైడెన్ పేర్కొన్నారు.

దీనికి బదులిచ్చిన ట్రంప్.. కాస్తంత ధీటుగానే సమాధానం ఇచ్చారు. తనను మూడేళ్ల అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకోలేదని.. ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలోనే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అమెరికాలో భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయని.. అదంతా ట్రంప్ వైఫల్యమని బైడెన్ ఆరోపించారు. ఒబామా కేర్ ను ట్రంప్ నాశనం చేసినట్లుగా బైడెన్ మండిపడ్డారు.

ఒబామా కేర్ కు ప్రత్యామ్నం ఎందుకు తీసుకురాలేకపోయారని ట్రంప్ ను బైడెన్ నిలదీశారు. ఒబామా కేర్ ను రద్దు చేయటం కారణంగా అమెరికా ప్రజలు ఇబ్బందులు పడిన వైనాన్ని గుర్తు చేశారు. దీనికి బదులిచ్చిన ట్రంప్.. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుందని చెప్పారు. మందుల ధరల్ని గణనీయంగా తగ్గించిన వైనాన్ని గర్తు చేశారు. వైద్య ఆరోగ్య విధానంపై తమ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్న బైడెన్ మాటల్ని కొట్టిపారేశారు.

భారత్ తో సహా.. ప్రపంచంలోని పలు దేశాల్లో ఎంతమంది మరణించారన్నది తెలిసిందే కదా అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ మాటలకు బైడెన్ పెద్ద ఎత్తున తిప్పి కొడుతున్నారు. ట్రంప్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తిందన్నారు. తాము అధికారంలోకి వస్తే పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. కరోనా విషయంలో తాము మెరుగైన వైద్యసేవల్ని అందించినట్లుగా ట్రంప్ సమర్థించుకోవటం గమనార్హం.

This post was last modified on September 30, 2020 12:38 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఇంకో ఐదేళ్ల వ‌రకు జ‌గ‌న్ సేఫ్‌…!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు ఏమీ జ‌ర‌గ‌దు. ఆయ‌న ప్ర‌శాంతంగా.. సాఫీగా త‌న ప‌ని తాను చేసుకు…

45 mins ago

పుష్ప వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ…. మాస్ జనాలకు కిక్కిస్తూ

నిర్మాణంలో ఉన్న టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల్లో భారీ క్రేజ్ దక్కించుకున్న వాటిలో పుష్ప 2 ది రూల్ మీద…

1 hour ago

చంద్ర‌బాబు.. న‌న్ను చంపేస్తానంటున్నాడు: జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా 45 ఏళ్ల అనుభ‌వం ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనే…

2 hours ago

ఓవర్ చేశానని ఒప్పుకున్న స్టార్ హీరో

డిజాస్టర్లు ఏ హీరోకైనా సహజం. ఇవి తప్పించుకున్న దర్శకులు ఉంటారేమో కానీ నటులు మాత్రం ప్రపంచంలోనే ఉండరు. కాకపోతే ఓటమిని…

3 hours ago

ప‌వ‌న్‌కు రిలీఫ్… చంద్ర‌బాబుకు తిప్పలు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు  ఎన్నిక‌ల గుర్తుల కేటాయింపు విష‌యంలో కొంత రిలీఫ్ ద‌క్కింది. కానీ, ఇదేస‌మ‌యంలో కూట‌మి పార్టీల…

4 hours ago

రజనీకాంత్ బయోపిక్ హీరో ఎవరబ్బా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…

4 hours ago