ఈ టెక్ జమానాలో వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల వాడకం ఎక్కువైంది. ఇక, వాట్సాప్ వంటి యాప్ లు చాలామంది నిత్యజీవితంలో, దైనందిన, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాల్లో భాగమయ్యాయి. వాట్సాప్ లో సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ కావడంతో వ్యక్తిగత విషయాలు, వ్యాపార లావాదేవీలను కూడా షేర్ చేసుకోవడం మామూలే.
అయితే, కొన్ని సందర్భాల్లో వాట్సాప్ వ్యక్తిగత గోప్యతకు సైబర్ నేరగాళ్లు సవాల్ విసురుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. భార్యాభర్తల మధ్య వ్యక్తిగత వ్యవహారాలు నెట్లో ప్రత్యక్షం కావడం….కొందరు ప్రముఖుల చాట్ హిస్టరీ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో రావడం వంటి ఘటన నేపథ్యంలో వాట్సాప్ లో వ్యక్తిగత సమాచారం భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలోనే వాట్సాప్ లో కొత్త తరహా స్పామ్ మెసేజ్ లతో యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు సైబర కేటుగాళ్లు. అత్యవసర సందేశం…ఎమర్జెన్సీ కోడ్ అంటూ మోసం చేసి యూజర్ల వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేస్తున్నారీ మోసగాళ్లు. హైదరాబాద్ నగరంలోని కొందరు ప్రముఖులు, వైద్యుల వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయిన ఘటన కలకలం రేపుతోంది.
హైదరాబాద్ లో కొందరు ప్రముఖులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మరోసారి వాట్సాప్ భద్రత, గోప్యతకు సవాల్ విసిరారు. ఆ ప్రముఖులు, డాక్టర్ల కాంటాక్ట్స్ లో ఉన్న నంబర్ల నుంచి సైబర్ నేరగాళ్లు ఓ సందేశం పంపించారు. ‘‘ఎమర్జెన్సీ హెల్ప్’’ అంటూ 6 డిజిట్ల కోడ్ ను వాట్సాప్ చేశారు. ఆ మెసేజ్ పొరపాటున పంపామని, ఆ ఎమర్జెన్సీ ఓటీపీ నంబర్ ను తిరిగి తమకు పంపాలని రిక్వెస్ట్ చేశారు. తమ కాంటాక్ట్ లోని నంబర్ నుంచి మెసేజ్ రావడంతో బాధితులు అనుమానించకుండా రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇచ్చిన వెంటనే సదరు బాధితుడి వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తాజాగా హ్యాక్ చేసిన ఫోన్ లో కాంటాక్ట్స్ కు ఇదే తరహాలో మెసేజ్ లు పెట్టి వారినీ బోల్తా కొట్టించారు.
ఈ రకంగా ‘‘ఎమర్జెన్సీ హెల్ప్’’ అంటూ వాట్సాప్ చాట్ పలువురి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేశారు. ఆయా వ్యక్తులు వాట్పాస్ వ్యక్తిగత సందేశాలను హ్యాక్ చేశారు. కొంతమంది బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వాట్సాప్‌లో వచ్చే కోడ్ మెసేజ్‌లను, ఈ తరహా లింక్ లను ఎవరికీ పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కోడ్ పంపితే వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారని హెచ్చరిస్తున్నారు. తమ మిత్రులకు ఫోన్ చేసి ఈ తరహా కోడ్ పంపమననారో లేదో తెలుసుకుంటే మంచిదని, ఒక వేళ ఈ తరహా మెసేజ్ లపై అనుమానం వస్తే వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
This post was last modified on September 29, 2020 2:42 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…