Trends

ట్విట్టర్‌ను ఫుట్‌బాల్ ఆడుకున్న ఆ క్రికెటర్

‘‘రాహుల్ తెవాతియాను చూస్తే బాధ కలుగుతోంది. అతను తన జట్టును ఓడిస్తున్నాడు’’… ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లె ఆదివారం రాత్రి 10.42 గంటలకు పెట్టిన ట్వీట్ ఇది. ఆ సమయానికి ట్విట్టర్లో అందరూ కూడా ఈ తెవాతియాను చెడామడా తిడుతున్నారు. బూతులు అందుకుంటున్నారు. రాబిన్ ఉతప్ప, జోఫ్రా ఆర్చర్ లాంటి ఆటగాళ్లుండగా వీణ్నెవర్రా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది అని కామెంట్లు చేస్తున్నారు. అప్పటికి తెవాతియా అంత చెత్తగా ఆడుతున్నాడు మరి.

20 ఓవర్లలో 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. తెవాతియా క్రీజులోకి వచ్చే సమయానికి సాధించాల్సిన రన్‌రేట్ 13కు పైనే ఉంది. అలాంటి టైంలో వచ్చి ఫోర్లు సిక్సర్లు కొట్టకపోగా.. సింగిల్స్ తీయడానికి కూడా అవస్థలు పడుతుంటే తిట్టకుండా ఎలా ఉంటారు. రాజస్థాన్ ఫ్యాన్స్ అనే కాదు.. పోటాపోటీగా సాగుతున్న మ్యాచ్‌ను నిస్సారంగా మార్చేస్తున్నాడంటూ న్యూట్రల్ ఫ్యాన్స్ సైతం తెవాతియాను తెగ తిట్టిపోశారు.

ట్విట్టర్లో ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ ఓ అరగంట పాటు తెవాతియాను తిట్టడానికే పరిమితం అయ్యారు. కానీ ఒక పది నిమిషాల తర్వాత తమ ట్వీట్లను చూసుకుని వాళ్లందరూ సిగ్గు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. కాట్రెల్ లాంటి వెస్టిండీస్ ప్రధాన ఫాస్ట్‌బౌలర్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు ఈ అనామక ఆటగాడు. ఆ దెబ్బతో ట్విట్టర్ జనాలకు నోట మాట రాలేదు. తెవాతియా విషయంలో అన్న మాటలకు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది.

రాజస్థాన్ ఆడిన తొలి మ్యాచ్‌లో తెవాతియా మూడు వికెట్లు తీయడంతో అతణ్ని బౌలర్‌గానే చూశారందరూ. నాలుగో స్థానంలో ఫించ్ హిట్టర్ టైపులో బ్యాటింగ్‌కు బంతులు వృథా చేస్తుంటే అతణ్ని తిట్టుకున్న వాళ్లందరూ కొంతసేపటికి యుటర్న్ తీసుకున్నారు. మొత్తంగా ఏడు సిక్సర్లు బాది రాజస్థాన్ చేజారిందనుకున్న మ్యాచ్‌ను ఆ జట్టు చేతుల్లోకి తెచ్చాడతను. చివర్లో ఆర్చర్ సైతం కొన్ని షాట్లు అందుకోవడంతో రాజస్థాన్ తేలిగ్గానే మ్యాచ్ గెలిచేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్య ఛేదనతో రాయల్స్ రికార్డు నెలకొల్పింది. మయాంక్ అగర్వాల్ సెంచరీ కొట్టడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగా.. తెవాతియా కంటే ముందు స్మిత్, శాంసన్ ధాటిగా ఆడి జట్టు విజయానికి మంచి పునాది వేశారు.

This post was last modified on September 28, 2020 10:15 am

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

33 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago