మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో మరో దుమారానికి కారణమయ్యింది. ఆ వేడుకకు రావడానికి సుకుమార్ భార్య తబిత ఆ సినిమా నిర్మాత కాబట్టి అనే కోణంలో బన్నీ అన్న మాటలు వేరే అర్థంలో వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాలకు వెళ్లి రావడం గురించి మరోసారి మెగా ఫ్యాన్స్ కొందరు తవ్వి తీస్తున్నారు. ఇక్కడితో ఆగడం లేదు. ఇవాళ రీ రిలీజ్ అయిన ఇంద్రలో శివాజీ పోషించిన క్యారెక్టర్ ని బన్నీకి ముడిపెడుతూ అక్కర్లేని ట్రోలింగ్ కి దారి తీస్తున్నారు. అలా అని ఐకాన్ స్టార్ అభిమానులు సైలెంట్ గా ఉండటం లేదు.
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ఒకే సంక్రాంతికి రిలీజైన టైంలో చిరంజీవి మహేష్ బాబు ఈవెంట్ కి వెళ్లడం గురించి ప్రశ్నిస్తున్నారు. మరి మేనల్లుడు ఫంక్షన్ కి ఎందుకు రాలేదని కౌంటర్ వేస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత హీరో ఫ్యామిలీ అయినా సరే సినిమాకు సంబంధం లేని బయటి అతిథులను తీసుకురాడనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఆ టైంలో మహేష్ అభ్యర్థన మీద చిరు అక్కడికి వెళ్ళారు. అందులోనూ పాత ఫ్రెండ్ విజయశాంతి కీలక పాత్ర చేసింది కాబట్టి. అంతే తప్ప బన్నీకి పోటీగా ఏదో రెచ్చగొట్టాలని కాదనేది ఇటువైపు నుంచి వినిపిస్తున్న వెర్షన్.
ఎప్పుడో పది పదిహేనేళ్ల క్రితం బన్నీ, చిరు, చరణ్, పవన్ పలు సందర్భాల్లో అన్న వీడియోలను ఇప్పుడు తీసుకొచ్చి ఘనకార్యంగా ఫీలవుతున్న వాళ్లకు కొదవ లేదు. మాస్ భాషలో ఇవన్నీ చేయడం వల్ల చిరు, అల్లు కుటుంబాలకు రవ్వంత కూడా ఫరక్ పడదు. కేవలం ఫ్యాన్స్ తమ సంతృప్తి కోసం చేస్తూ టైం వేస్ట్ చేయడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. పోనీ దీని ప్రభావం పుష్ప 2 మీద పడుతుందా అంటే నిజంగా సినిమా బాగుంటే ఎవరూ డ్యామేజ్ చేయలేరు. చెప్పను బ్రదర్ తర్వాత అల్లు అర్జున్ మీద ఆన్ లైన్ లో ఇంత చర్చ జరగడం బహుశా ఇది మూడోసారి అని చెప్పొచ్చు. కొన్నిరోజులు కొనసాగేలా ఉంది.
This post was last modified on August 22, 2024 6:24 pm
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…