Movie News

వారణాసి హీరోయిన్ విదేశీ రహస్యం

ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్ చూసినవాళ్లు అందరికీ సుపరిచితురాలే. ఆ మాటకొస్తే పాతికేళ్ల క్రితం తన డెబ్యూ టాలీవుడ్ లోనే జరగాల్సింది. కానీ షూటింగ్ ఆగిపోవడంతో ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. తర్వాత తెలుగులో చేసే అవకాశం రాలేదు కానీ పూర్తిగా హిందీలో సెటిలయ్యింది.

మహేష్ బాబు సరసన రాజమౌళి డైరెక్షన్లో హీరోయిన్ గా ఎవరు ఉంటారనే ప్రశ్న ఫ్యాన్స్ మెదళ్లను తొలుస్తున్న టైంలో ప్రియాంకా చోప్రా ఎంపిక కావడం మొదట అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ఈవెంట్ లో ఆమె ఎనర్జి చూసాక జక్కన్న ఎంపిక సరైనదేనని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రియాంకా చాలా కాలంగా ఇండియన్ సినిమాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీస్ కు పరిమితమై బొత్తిగా హిందీ ఆఫర్లు వద్దనేసింది. నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్నాక మన దేశానికి రావడం తగ్గించేసింది. ఈ మధ్య వారణాసి షూటింగ్, అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన యాక్షన్ మూవీ ది బ్లఫ్ ప్రమోషన్లకు తరచు వస్తున్న ప్రియాంకా చోప్రా తన ఫారిన్ కెరీర్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇక్కడే ఉంటే ఒకే మూసలో ఉంటాననే భయంతోనే వెళ్లిపోయానని, అంతర్గత రాజకీయాలు కూడా దీనికి ఒక కారణమని వివరించింది.

దూరంగా ఉన్నంత మాత్రాన బాలీవుడ్ ని కాదనుకుని వెళ్లినట్టు కాదని, వారణాసి రూపంలో మరో అద్భుతమైన అవకాశం రావడం వల్ల మరోసారి భారతీయ ప్రేక్షకులను కలుసుకునే అదృష్టం దక్కిందని మురిసిపోతోంది. నాలుగు పదుల వయసులో మహేష్ బాబు లాంటి క్రేజీ హీరో సరసస అది కూడా రాజమౌళి డైరెక్షన్లో అంటే ఇంతకన్నా జాక్ పాట్ ఏముంటుంది. అందుకే ఇంత ఆనందం కనిపిస్తోంది. బ్లఫ్ కంటే ఎక్కువగా వారణాసి కబుర్లే హైలైట్ అవుతున్నాయి. 2015లో వచ్చిన క్వాన్టికో తర్వాత ప్రియాంకాకు హాలీవుడ్ లోనే ఆఫర్లు కొనసాగాయి. వారణాసితో మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో వచ్చే ఏడాది తేలనుంది.

This post was last modified on March 12, 2026 1:14 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

15 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

23 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

38 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

39 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago