Movie News

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027 ఏప్రిల్ లో వచ్చే వారణాసి కోసం రాజమౌళి ఇప్పటి నుంచే విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టైటిల్ లాంచ్ కోసమే కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో ఈవెంట్ చేశారు. నెలకోసారి ఏదో రూపంలో ట్రెండింగ్ అయ్యే కంటెంట్ ఇస్తున్నాడు. ఇదంతా గ్లోబల్ అటెన్షన్ కోసమే.

బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు ఇది ఫాలో కావాల్సిందే. కానీ దురంధర్ ది రివెంజ్ కొత్త గ్రామర్ నేర్పిస్తోంది. ఇది వరకు బాలీవుడ్ మేకర్స్ చదవని మార్కెటింగ్ పాఠాన్ని చదువుకోమంటోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా నిర్మాత సంస్థ జియో స్టూడియోస్, నిర్మాత కం దర్శకుడు ఆదిత్య ధార్ ఎలాంటి పబ్లిసిటీ చేయడం లేదు. ఇంటర్వ్యూలు ఇవ్వడం, కపిల్ శర్మ లాంటి కామెడీ షోలలో పాల్గొని స్కిట్లు చేయడం లాంటి వాటికి దూరం ఉంటున్నారు.

రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఎవరూ మీడియా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా బుకింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. ఇప్పటికే 50 కోట్లు వసూలైపోగా రోజుకు బుక్ మై షోలో కనిష్టంగా 30 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

దురంధర్ మొదటి భాగం ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే రేపటి నుంచి ఇండియా వైడ్ అయిదు రోజుల పాటు మరోసారి దీన్ని స్క్రీనింగ్ చేస్తున్నారు. హిందీలోనే ఇలా ఉంటే ఇక తెలుగు తమిళ ప్రమోషన్లు ఏం పట్టించుకుంటారు. అయినా సరే హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు నమోదయ్యేలా ఉంది. ఏపీ మెయిన్ సెంటర్స్ లో సాయంత్రం షోలు దాదాపు ఫుల్ అయ్యాయి. రాత్రికి పాజిటివ్ టాక్ వస్తే నెక్స్ట్ డే నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నా సరే వసూళ్ల మోత ఖాయం.

ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఒకటుంది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఎలాంటి గిమ్మిక్కులు చేయకపోయినా జనం ఆటోమేటిక్ గా సినిమా చూస్తారు. కానీ అన్ని సినిమాలకు ఇదే సూత్రం వర్తించదు. ఎలా చూసుకున్నా దురంధర్ ఆస్కార్ మెట్లు ఎక్కలేదు. ఎక్కే ఛాన్స్ లేదు. కానీ వారణాసి లాంటివి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్కోప్ ఉన్నవి. అందుకే జక్కన్న అంతగా కష్టపడతారు. దురంధర్ కు అంత శ్రమ అవసరం లేదు కాబట్టి రిలాక్స్ అవుతుంది.

This post was last modified on March 12, 2026 9:53 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

4 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

4 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

4 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

5 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

7 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

8 hours ago