డ్రీమ్ ఎలెవన్.. ఇప్పుడు క్రికెట్ యువతను ఊపేస్తున్న గేమ్ యాప్. విదేశాల్లో వివిధ ఆటల మీద అధికారికంగా బెట్టింగ్ నడుస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ మన దగ్గర బెట్టింగ్ మీద నిషేధం ఉంది. ఐతే డ్రీమ్ ఎలెవన్ ద్వారా బెట్టింగ్ చేయొచ్చు కానీ.. అది రెగ్యులర్‌గా సాగే బెట్టింగ్‌కు భిన్నం. రెండు జట్లు తలపడుతుంటే ఆ రెండింటి నుంచి నచ్చిన ఆటగాళ్లలో ఒక ఎలెవన్ తయారు చేసుకుని అందులో కెప్టెన్, వైస్ కెప్టెన్‌లను ఎంచుకుని (వీళ్లకు అదనపు పాయింట్లుంటాయి) డబ్బులు పెట్టిన బెట్టింగ్‌కు వెళ్లొచ్చు ఈ యాప్ ద్వారా.
దీన్ని పోలిన మరెన్నో యాప్స్ గత కొన్నేళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వీటి మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ ఏడాది చైనా సంస్థ ‘వివో’ ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంటే దాని స్థానంలో హక్కులు రూ.250 కోట్లకు సొంతం చేసుకున్నది డ్రీమ్ ఎలెవన్ సంస్థే కావడం విశేషం. దీన్ని బట్టి ఈ యాప్ పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ సందర్భంగా రోజూ వందల కోట్లలో ఈ యాప్ ద్వారా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. చెన్నై ఆడే మ్యాచ్‌లకు వచ్చినపుడు బెట్టింగ్‌లు కట్టే ఎవ్వరూ కూడా ధోనీని తమ జట్టులోకి చేర్చుకోకుండా పక్కన పెట్టేస్తుండటం గమనార్హం. ట్రెండ్స్ చూస్తే ధోనీని అతి కొద్ది మంది మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా వ్యక్తిగత అభిమానంతో కావచ్చు. డ్రీమ్ ఎలెవన్ జట్లలో రెగ్యులర్‌గా ఉండే ఆటగాళ్లలో ధోనీకి స్థానం ఉండట్లేదు. మామూలుగా వికెట్ కీపర్లకు కచ్చితంగా చోటు ఇస్తుంటారు. కానీ ధోనీని మాత్రం పక్కన పెట్టేస్తుండటాన్ని బట్టి అతడి మీద అభిమానులు నమ్మకం కోల్పోయారని స్పష్టమవుతోంది.
తొలి మూడు మ్యాచ్‌ల్లో ధోని బ్యాటింగ్ చూశాక మరింతగా వాళ్లు నమ్మకం కోల్పోయి ఉంటారనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ధోనీకి ప్రతిదీ కలిసొచ్చేది. కానీ ఇప్పుడు తిరగబడుతోంది. అతను ఫెయిలవుతున్నాడు. జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. తొలి మ్యాచ్‌లో రాయుడి పుణ్యమా అని గెలిచింది కానీ.. చెన్నైకి ఈ సీజన్లో కష్టాలు తప్పవని.. ధోనీకి మున్ముందు గడ్డు రోజులు తప్పవని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను తన ప్రదర్శనను ఎలా మారుస్తాడో, జట్టునెలా నడిపిస్తాడో చూడాలి.
This post was last modified on September 27, 2020 6:39 am
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…