Trends

అక్కడ హిందువుల పరిస్థితి ఘోరం

ఇప్పుడు ప్రపంచం దృష్టంతా బంగ్లాదేశ్ మీదే ఉంది. అక్కడ కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకుని.. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాక, దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇండియాకు మంచి ఫ్రెండుగా పేరున్న హసీనా.. ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని అక్కడే ఓ రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఆమె బ్రిటన్‌కు వెళ్లాలని అనుకున్నా ఆ దేశం ఇప్పుడే అక్కడికి రావొద్దని చెప్పడంతో ఢిల్లీలో ఉంటున్నారు.

హసీనా తండ్రి, బంగ్లా జాతిపితగా పేరున్న ముజీబ్ ఉర్ రెహమాన్ ప్రధానిగా ఉండగా ప్రవేశపెట్టిన స్వాతంత్ర్య సమర యోధుల రిజర్వేషన్‌ను ఇప్పటికీ కొనసాగిస్తుండడం.. బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారి మనవళ్లకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చూడడం యువతలో ఆగ్రహానికి కారణమైంది. దీని మీద కొన్ని నెలల కిందట మొదలైన అల్లర్లు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓవైపు పాకిస్థాన్, మరోవైపు అమెరికా ప్రతిపక్షాలకు పరోక్షంగా అండగా నిలుస్తూ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకునేందుకు కారణం కావడంతో హసీనా తప్పుకోక తప్పలేదు.

ఐతే రిజర్వేషన్ల అంశంలో హసీనా తీరు వివాదాస్పదం కావచ్చు కానీ.. ఆమెకు పాలకురాలిగా మంచి పేరుంది. తన హయాంలో బంగ్లాదేశ్‌ ఎంతో అభివృద్ధి చెందింది. సెక్యులర్ వాదిగా పేరున్న హసీనా హయాంలో బంగ్లాలో అన్ని మతాల వాళ్లు.. ముఖ్యంగా హిందువులు సురక్షితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు మత ఛాందస వాదులుగా పేరుంది. వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి.

హసీనా వైదొలగ్గానే బంగ్లాలోని మత ఛాందస వాదులు చెలరేగిపోయారు. హిందువుల ఇళ్ల మీద దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు వెళ్లి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గొడవ చేయడం.. ఇళ్లను తగలబెట్టడం, ధ్వంసం చేయడం లాంటివి చేశారు. ఆలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అంతే కాక హిందువులను రోడ్ల మీదికి తీసుకొచ్చి తీవ్రంగా హింసించి చంపుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏ కారణంతో హసీనాను పదవి నుంచి దించినప్పటికీ.. బంగ్లా మున్ముందు మత మౌఢ్యంలోకి వెళ్లబోతోందని.. అక్కడ పరిస్థితులు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తరహాలో మారబోతున్నాయని.. ఇకపై అక్కడ హిందువులు బతకడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 6, 2024 9:41 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

5 hours ago