Trends

రోజూ ఒక్కసారైనా నవ్వాలి.. ఆ దేశంలో తాజా చట్టం

నవ్వడం ఒక యోగంగా అప్పుడెప్పుడో మన పెద్దలు చెప్పేశారు. ఇప్పుడీ విషయాన్ని రూల్ రూపంలోకి తీసుకొచ్చిన ఒక దేశం తీరు ఆసక్తికరంగా మారింది. రోజు మొత్తంలో ఒక్కసారైనా కచ్ఛితంగా నవ్వాలన్న చట్టాన్ని తీసుకొచ్చిన వైనం చూస్తే.. అంత యంత్రాల మాదిరి బతికే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారా? ఇంతకూ ఆ దేశం ఏంటి? ఆ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? దాని నేపథ్యం ఏంటి? లాంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

ఈ కొత్త చట్టాన్నిజపాన్ దేశంలోని ఒక రాష్ట్రం (యమగట) తాజాగా తీసుకొచ్చింది. ప్రతి రోజు అందరూ నవ్వాలని.. కనీసం రోజులో ఒక్కసారైనా నవ్వటాన్ని తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. శారీరక.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాలన్న సదుద్దేశ్యంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొంది. తాజాగా ఈ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ ను జారీ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నవ్వుతో కూడిన వాతావరణం పని ప్రదేశంలో ఉండేలా ప్రోత్సహించాలంటూ కంపెనీలను ఆదేశించిన ఈ చట్టంలో మరిన్ని అంశాన్ని ఉన్నాయి. ప్రతి నెల ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని పేర్కొన్న ఈ చట్టం.. జపాన్ లోని ‘‘యమగట విశ్వవిద్యాలయం’’లోని ప్రొఫెసర్లు చేసిన పరిశోధనల ఫలితంగా చట్టంగా తీసుకొచ్చారు. మెరుగైన ఆరోగ్యం.. జీవనకాలం పెంపునకు ఏయే అంశాలు తోడ్పాటును అందిస్తాయన్న అంశంపై రీసెర్చ్ చేయగా.. తక్కువగా నవ్వే వాళ్లలో కొన్ని రకాల వ్యాధుల వల్ల మరణ ముప్పు పెరుగుతుందని గుర్తించారు.

ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే.. ఈ చట్టాన్ని కొందరు రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు నవ్వలేకపోవచ్చని.. ఈ చట్టం వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాదిస్తున్నారు. ఈ వాదనపై యమగట రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

ప్రతిరోజూ నవ్వాలని తాము బలవంతం చేయట్లేదని.. ప్రజల ఇష్టానికే వదిలేస్తున్నామని.. ఈ కారణంతోనే నవ్వని వారిపై ఎలాంటి ఫైన్ వేయట్లేదని పేర్కొన్నారు. ఏమైనా.. ప్రజలు నవ్వితే ఆరోగ్యంగా బతుకుతారన్న అంశంపై అధ్యయనం చేసి.. దాన్ని చట్టంగా మార్చే వరకు వెళ్లటాన్ని చూస్తే.. తమ ప్రజల సంక్షేమాన్ని అక్కడి ప్రభుత్వాలు ఎంత లోతుగా చూస్తున్నాయన్న భావన కలుగక మానదు. అదే టైంలో రోజులో ఒక్కసారి కూడా నవ్వని జనాల మధ్య మనం లేకపోయామన్న పెద్ద రిలీఫ్ ఒక్కసారి రావొచ్చని చెప్పాలి.

This post was last modified on July 13, 2024 6:37 pm

Share

Recent Posts

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

4 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

6 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

6 hours ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

6 hours ago

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

7 hours ago

కన్నడిగుల ఆక్రోశం అర్థరహితం

సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…

7 hours ago