టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు వ్యవహారం ఎన్నికలకు ముందు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినీ నటి త్రిష వల్లే విజయ్ కు ఆయన భార్య సంగీత విడాకులు ఇస్తున్నారంటూ భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరు కావడం, లండన్ లో ఉన్న సంగీత హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కారణమేదైనా విజయ్, సంగీతలు విడాకులు తీసుకోవడం ఖాయంగా కనిపించింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా విజయ్ తో విడాకుల పిటిషన్ ను సంగీత వెనక్కు తీసుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
తన భర్త విజయ్ నుంచి విడాకులు కావాలంటూ సంగీత చెంగల్సట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు జరగడం, అందులో విజయ్ విడాకుల టాపిక్ ను మిగతా పార్టీలు అస్త్రంగా మార్చుకొని మాటల దాడి చేయడం తెలిసిందే. అంతేకాదు, విజయ్ బర్త్ డేను త్రిషతో కలిసి సెలబ్రేట్ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా త్రిషను అవమానిస్తూ డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ వెంటనే స్టాలిన్ ను పోలీసులు ఆఘమేఘాల మీద అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు తమిళ రాజకీయాలలో సంచలనం రేపాయి.
ఇటువంటి నేపథ్యంలో హఠాత్తుగా విజయ్ తో విడాకులు కావాలి అని పిటిషన్ దాఖలు చేసిన సంగీత ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఈ విడాకుల పిటిషన్ విచారణను ముగిస్తున్నట్లు చెంగల్సట్లు కోర్టు వెల్లడించింది.
This post was last modified on August 7, 2026 4:36 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…