తెలుగు ప్రేక్షకుల సినిమా అభిమానం గురించి వేరే భాషలకు చెందిన వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. ఇప్పుడు మన వాళ్ల అభిమానం మరోసారి చర్చనీయాంశం అయ్యేలా ఉంది. నిన్న రిలీజైన కమల్ హాసన్ సినిమా ‘ఇండియన్-2’కు ఇండియా మొత్తంలో అత్యధిక డే-1 వసూళ్లు తెలుగు నుంచే వచ్చాయన్నది ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేస్తున్న అంశం.
కమల్ హాసన్ తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరు. శంకర్ అక్కడి లెజెండరీ డైరెక్టర్లలో ఒకడు. ఈ కాంబినేషన్‌కు ఆటోమేటిగ్గా తమిళంలోనే ఎక్కువ క్రేజ్ ఉండాలి. పైగా వాళ్లిద్దరూ కలిసి చేసింది ‘ఇండియన్’ లాంటి ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్. కానీ రకరకాల కారణాల వల్ల ఈ చిత్రానికి విడుదల ముంగిట ఆశించిన హైప్ లేకపోయింది. తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా జరిగాయి. తెలుగులో కూడా బజ్ తక్కువే కానీ.. తమిళంతో పోలిస్తే తెలుగులోనే మెరుగ్గా ప్రి సేల్స్ జరిగాయి.
తొలి రోజు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్‌ఫుల్స్‌తో మొదలైంది ‘భారతీయుడు-2’. టాక్ మరీ బ్యాడ్‌గా ఉన్నప్పటికీ తొలి రోజు ఓపెనింగ్స్ మీద పెద్దగా ప్రభావం పడనట్లే ఉంది. పది కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూళ్లు ఉంటాయని అంచనా. షేర్ రూ.6-7 కోట్ల మధ్య ఉండొచ్చు. ఐతే తమిళంలో తొలి రోజు ‘ఇండియన్-2’ వసూళ్లు పది కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేలా లేవు. తెలుగుతో పోలిస్తే తమిళంలో టాక్ బెటర్‌గా ఉన్నప్పటికీ తొలి రోజు వసూళ్లలో అది ప్రతిబింబించేలా లేదు.
తమిళనాట థియేటర్లు తక్కువ కావడం.. తెలుగుతో పోలిస్తే టికెట్ల ధరలు తక్కువ ఉండడం కూడా ఇక్కడితో పోలిస్తే అక్కడ కలెక్షన్లు తక్కువగా ఉండడం కారణమే కానీ.. ఎలా చూసినా సరే ఇలాంటి భారీ చిత్రానికి తమిళంతో పోలిస్తే తెలుగులో వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటే అది ట్రేడ్ వర్గాలకు షాకిచ్చే విషయమే. దీంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ చర్చనీయాంశంగా మారుతోంది.
This post was last modified on July 14, 2024 9:59 am
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…