వరుణ్ తేజ్ గత సినిమాల ఓపెనింగ్స్ ఒకసారి తవ్వి తీస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకు చాలా చోట్ల ఫుల్స్ పడలేదు. కారణం సింపుల్. మెగా ప్రిన్స్ ఇమేజ్ కన్నా వాటిలో కంటెంట్ మీద ప్రేక్షకులకు ముందే సదాభిప్రాయం లేకపోయింది. దాని వల్ల చూడాలన్న ఆసక్తిని తెచ్చుకోలేదు. వీటికి తోడు మౌత్ టాక్, రివ్యూలు నెగటివ్ గా ఉండటంతో వీకెండ్ లోపే వాష్ అవుట్ అయిపోయాయి. మట్కా, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున, గని ఏది తీసుకున్నా అన్నింటిదీ ఒకే కథ ఒకే కథ.
తాజాగా వచ్చిన కొరియన్ కనకరాజు ఈ లెక్కలు మార్చేశాడు. ఫైనల్ టాక్, ఆడియన్స్ జడ్జ్ మెంట్ ఏంటనేది పక్కన పెడితే నిన్న రాత్రి చాలా చోట్ల ప్రీమియర్లు దాదాపు ఫుల్ అయ్యాయి. కొన్ని చోట్ల అదనంగా షోలు జోడించాల్సి వచ్చింది. హైదరాబాద్ లో అప్పటికప్పుడు యాడైన ఆటలు చాలానే ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లోనూ రెస్పాన్స్ బాగుంది. కేవలం కొన్ని సెంటర్లకే పరిమితం చేయకుండా దాదాపు ప్రతి చోట పడేలా ప్లాన్ చేయడం యువి క్రియేషన్స్ చేసిన తెలివైన పని.
ఇక టాక్ విషయానికి వస్తే ప్రీమియర్ల నుంచి డీసెంట్ నుంచి బాగుందనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సత్య, వరుణ్ తేజ్, మురళీధర్ గౌడ్ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొరియాలో పెట్టిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ కోసమే అయినా వాళ్ళు కూడా ఎంటర్ టైన్మెంట్ నే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్, సెకండాఫ్ గ్రాఫ్ హెచ్చుతగ్గుల గురించి కొన్ని కామెంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా వరుణ్ గత సినిమాల్లాగా నిరాశ పరచలేదన్నది నిజం.
ఎక్కడిదాకా వెళ్తుందనేది తేలాలంటే కనీసం వారాంతం దాకా ఆగాలి. పోటీ పెద్దగా లేకపోవడం కొరియన్ కనకరాజుకి ప్లస్ కానుంది. డిసి, కెజెక్యూలు ఉన్నప్పటికీ వాటిలో ఉన్న క్యాస్టింగ్, బజ్ తో పోల్చుకుంటే వరుణ్ తేజ్ కున్న అడ్వాంటేజ్ చాలా ఎక్కువ. కాకపోతే ఆక్యుపెన్సీలను పెంచుకుంటూ పోయేలా టాక్ నిలబడాలి. ఒక్కోసారి ప్రీమియర్లకు, రెగ్యులర్ షోల మధ్య టాక్ పరంగా వ్యత్యాసం వస్తుంది. దాన్ని కనక కనకరాజు అధిగమిస్తే వరుణ్ తేజ్ కి మంచి కంబ్యాక్ దొరికినట్టే.
This post was last modified on August 7, 2026 11:21 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…