Movie News

మధ్య వయసులో ‘విశ్వనాథ్’ ప్రేమ

సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ తెలుగువారే కావడంతో మన ఫ్లేవరూ కనిపిస్తోంది. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా మమిత బైజు హీరొయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ అంశాలు ఎక్కువ లేకుండా అట్లూరి స్టైల్ లోనే రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చింది.

రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించాలన్న లక్ష్యాన్ని తల్లి ప్రోత్సాహంతో చేరుకుంటాడు సంజయ్ విశ్వనాథ్ (సూర్య). అయితే నిండా మూడేళ్లు కూడా నిండని గారాల కొడుక్కి ఎముకలకు సంబంధించిన పెద్ద జబ్బు రావడంతో డోనర్ అవసరం పడుతుంది. దాని కోసం విదేశాలకు వెళ్తాడు విశ్వనాథ్. అక్కడే దాతగా ఉన్న అమ్మాయి (మమిత బైజు) పరిచయమై ఇండియాకు వస్తుంది. తెచ్చింది బిడ్డ కోసమే అయినా వయసు వ్యత్యాసం చూసుకోకుండా విశ్వనాథ్ ని ప్రేమిస్తుంది. అటుపై జరిగేది అసలు స్టోరీ.

విజువల్స్ చూస్తుంటే గతంలో వెంకీ అట్లూరి చెప్పినట్టు ఒక మధ్య వయసు వ్యక్తికి పాతికేళ్ల అమ్మాయికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందనే పాయింట్ మీదే రాసుకున్నారు. అయితే ఇక్కడ చెప్పని ట్విస్ట్ ఏదో దాచినట్టు అనిపిస్తోంది కానీ అదేంటనేది తెరమీద చూశాక క్లారిటీ వస్తుంది. సన్నని పెప్పర్ సాల్ట్ లుక్ తో సూర్య చాలా హోమ్లీగా ఉండగా మమిత బైజు అల్లరితో పాటు రాధికా శరత్ కుమార్, రవీనాటాండన్ ల క్యారెక్టర్లు కీలకం కాబోతున్నాయి.

వచ్చే వారం రిలీజవుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కి బాక్సాఫీస్ దగ్గర మంచి పోటీనే ఎదురు కానుంది. తాజాగా వచ్చిన కొరియన్ కనకరాజు, డిసిల టాక్ చూస్తుంటే సెకండ్ వీక్ కూడా నిలబడేలా ఉన్నాయి. ఇంకోవైపు ఆగస్ట్ 14 విశాల్ మకుటంతో పాటు సన్నీ డియోల్ బట్వారా థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. మల్టీప్లెక్సుల్లో ఈ కాంపిటీషన్ వల్ల సూర్యకు కొంత ఇబ్బంది కలగొచ్చు. టాక్ యునానిమస్ గా వస్తే కరుప్పు తర్వాత సూర్యకు మరో సూపర్ హిట్ దక్కుతుంది. చూద్దాం.

This post was last modified on August 8, 2026 7:40 am

Share

Recent Posts

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

27 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

3 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

6 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

11 hours ago