Movie News

అమెచ్యూరిష్ వివాదంపై స్పందించిన మెగా హీరో

ఈ రోజు మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది కొరియన్ కనకరాజు సినిమా. వరుణ్ తేేజ్ హీరోగా మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ మూవీలో ఒక చిన్న సీన్ విషయంలో వివాదం చెలరేగింది. గత కొన్ని రోజులుగా సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమాలోని ఒక డైలాగ్ మీద సోషల్ మీడియాలో ఫన్ నడుస్తోంది.

ఆ సీన్లో ఎన్టీఆర్, చంద్రమోహన్ కరాటేలో తలపడతారు. ముందుగా చంద్రమోహన్ పంచ్ చూసి, ఎన్టీఆర్.. ” మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్ గా ఉంది అంటారు”. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఒక మీమ్ అయిపోయింది. ఐతే లెజెండరీ నటుడి డైలాగ్ ను కామెడీ కోసం వాడుతుండడాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంగీకరించలేకపోతున్నారు. ఆల్రెడీ దీని మీద కోపంగా ఉండగా.. ఈ డైలాగ్ ను కొరియన్ కనకరాజు సినిమాలో వాడడం వారి ఆగ్రహాన్ని ఇంకా పెంచింది. ఈ సినిమాలో కమెడియన్ సత్య.. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ను గుర్తు చేస్తూ.. ఈ డైలాగ్ చెప్తాడు.

థియేటర్లలో ఈ సన్నివేశానికి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ హీరో అయిన వరుణ్ నటించడంతో దీన్ని నెగెటివ్ గా చూస్తున్నారు. సోషల్ మీడియాలో వివాదం పెద్దది అవుతున్న నేపథ్యంలో కొరియన్ కనకరాజు సక్సెస్ ప్రెస్ మీట్లో దీని గురించి విలేకరులు ప్రశ్నించగా.. వరుణ్ స్పందించాడు. తాము సినిమాలో చేసింది ఇమిటేషన్ తప్ప ట్రోలింగ్ కాదని.. ఈ రెంటికి చాలా తేడా ఉందని వరుణ్ అన్నాడు.

తాను ఇంతకుముందు ఎఫ్-3 మూవీలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పాత్రను ఇమిటేట్ చేశానని వరుణ్ గుర్తు చేశాడు. తన సినిమా ప్రమోషన్స్ లో కూడా చిరంజీవి గారిని, కృష్ణ గారిని కూడా ఇమిటేట్ చేశామని.. సినిమాలో ఆ డైలాగ్ అలానే ఉంటుందని అతను చెప్పాడు. తాము ఇది హెల్తీగానే చేశామని.. ఫన్ కోసం చేసిన దాన్ని ఇంకోలా చూడొద్దని కోరాడు. ఇమిటేషన్ గొప్ప నటులను చేస్తామని.. కావాలని ట్రోలింగ్ చేయలేదనీ వరుణ్ స్పష్టం చేశాడు. ఎవరిని అగౌరవ పరచటం తమ ఉద్దేశం కాదని.. తనకు ఏ ఒక్కరి పట్ల అలాంటి భావం లేదని వరుణ్ అన్నాడు. సత్యపై ఆ సీన్ నవంబర్లో షూట్ చేసినట్లు అతను తెలిపాడు.

This post was last modified on August 7, 2026 5:04 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

5 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

35 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago