యాంకర్లు.. స్పోర్ట్స్ ప్రెజెంటర్లు ఒకప్పుడు చాలా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా కనిపించేవాళ్లు. కానీ వాళ్లలోనూ గ్లామర్ కోణం చూపించి యువతను ఆకర్షించడం తర్వాత ట్రెండుగా మారింది. ఇక స్పోర్ట్స్ ప్రెజెంటర్ల విషయానికి వస్తే.. మయంతి లాంగర్.. అర్చనా విజయ.. షిబాని దండేకర్ ఎంత హాట్ హాట్ గా కనిపిస్తారో తెలిసిందే. ఐతే ఈ ముగ్గురిలో మయంతి ప్రత్యేకం.
మిగతా ఇద్దరూ ప్రధానంగా గ్లామర్‌ను నమ్ముకుంటే.. మయంతి గ్లామర్‌కు తోడు గొప్ప విషయ పరిజ్ఞానంతో, వాక్చాతుర్యంతో క్రీడాభిమానుల మనసుల్లోకి దూసుకెళ్లిపోయింది. దశాబ్దానికి పైగా వివిధ క్రీడా ఈవెంట్లలో తనదైన శైలి వ్యాఖ్యానంతో, ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకుంటున్న మయంతి.. ముఖ్యంగా ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అందులో వచ్చే పేరుమోసిన మేల్ క్రికెట్ అనలిస్టులకు దీటుగా మయంతి తన క్రికెట్ పరిజ్ఞానంతో కట్టిపడేస్తుంటుంది. ఐతే ఈ భామ ఈసారి ఐపీఎల్‌కు అందుబాటులో లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. ఈ విషయాన్ని ప్రసాదరదారు అయిన స్టార్ స్పోర్ట్స్ ధ్రువీకరించింది కూడా.
మయంతి ఈసారి ఐపీఎల్‌కు దూరం కావడానికి ఆమె బిడ్డకు జన్మనివ్వడమే కారణం. ఆమె కర్ణాటక క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికీ చాలా ఏళ్ల కిందటే పెళ్లయింది. గత ఏడాది ఆమె గర్భవతి కాగా.. కొన్ని నెలల కిందటే ప్రసవించింది. ఈ సమయంలో బిడ్డను వదిలి ఐపీఎల్ కోసం మయంతి దుబాయ్ వెళ్లడం ఇబ్బందే. పైగా కరోనా భయం కూడా వెంటాడుతోంది. అందుకే ఐపీఎల్‌కు వెళ్లడం రిస్క్ అని భావించి ఆమె టోర్నీ యాంకరింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె కూడా కన్ఫమ్ చేసింది. మయంతి లేని ఐపీఎల్ వ్యాఖ్యానం కళ తప్పుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on September 19, 2020 1:22 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…