రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి భారీగా దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నపాటి జ్వరానికి కూడా ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లాలంటే భయపడే రోజులు వచ్చాయి. ఇక గుండె జబ్బులు, పక్షవాతం వచ్చిన రోగులు సంగతి సరే సరి. రోగం కంటే హాస్పిటల్ బిల్లులే ఎక్కువగా భయపెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి వద్ద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. సుశిక్షితులైన వైద్యులు, స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తుండటంతో నిరుపేద, మధ్య తరగతి రోగులు ఎయిమ్స్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కానింగ్ కూడా అతి తక్కువ ఖర్చుకే చేస్తున్నారు. అవసరమైన వారికి తక్కువ ఫీజులతో శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దాంతో ఈ ఆసుపత్రికి రోగులు పోటెత్తుతున్నారు. గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి రోగులు తరలి వస్తున్నారు. రోజుకు 2 వేల నుంచి 3 వేల మంది వరకు ఓపి నమోదవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో చికిత్స ఆలస్యం అవుతుందని రోగులు వాపోతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాయలేక ఇబ్బంది పడుతున్నారు.
ప్రజల ఇబ్బందిని గమనించిన జనసేన రాష్ట్రంలో మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలోని ఐదు కోట్ల జనాభాకు ఒక ఎయిమ్స్ ఆసుపత్రి సరిపోవడం లేదని, జనాభా ప్రతిపాదిక, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని జనసేన కోరింది. కేంద్రం కనుక దీనికి ఒకే చెబితే రాష్ట్ర ప్రజలకు సరైన స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జనసేన చేసిన మేలు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు.
This post was last modified on August 6, 2026 10:24 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…