Political News

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కుమారుడి వ్యవహారం రచ్చ రచ్చ కాగా ఇప్పుడు రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ కుమారుడి ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కాకపొతే బండి సంజయ్ కుమారుడికి అండగా నిలవగా ప్రకాష్ గౌడ్ విలన్ గా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాడు.

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ మణికొండకు చెందిన రూపా రెడ్డి కుమార్తెను ప్రేమించాడు. ఇది ప్రకాష్ గౌడ్ కు నచ్చలేదు. కుమారుడి ప్రేమను వ్యతిరేకించాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య వివాదం నెలకొంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న తనపై తండ్రి ప్రకాష్ గౌడ్ దాడులు చేయించారని, తనకు అండగా నిలిచిన మిత్రులు, శ్రేయోభిలాషులపై కూడా దాడులు చేయిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేయడం ఇప్పుడు తెలంగాణాలో సంచలనం సృష్టిస్తుంది.

అంతటితో ఊరుకోకుండా మణికొండలోని రూపా రెడ్డి ఇంటికి వచ్చిన కొందరు అపరిచితులు గొడవకు దిగారని, భయాందోళనకు గురించేసేందుకు ప్రయత్నించారని మీడియకు తెలిపారు. ఈ విషయం పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెడితే పోలీసులు స్వీకరించకపోగా తమ మీదనే కేసు బనాయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ వివాదంలో చిక్కుకున్న ప్రకాష్ గౌడ్ మాత్రం నోరువిప్పడం లేదు. ఈ వివాదం ఇపుడిప్పుడే రాజకీయ రంగు పులుము కుంటుంది. బాధ్యతగా వ్యవహారించాల్సిన ఒక ఎమ్మెల్యే వలన తన ప్రాణాలకు ముప్పు వుందని ఆయన కుమారుడే ఫిర్యాదు చేస్తున్నాడని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.

This post was last modified on August 6, 2026 10:59 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago