Trends

66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయాయట

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. భారత్ ను తీవ్రంగానే ప్రభావితం చేసింది. ప్రస్తుతానికి అత్యధిక కేసుల నమోదులో దూసుకెళుతున్న భారత్ లో.. కరోనా వైరస్ నేపథ్యంలో చోటు చేసుకున్న విపరిణామాలకు సంబంధించి తాజాగా ఒక నివేదిక విడుదలైంది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో.. అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయినట్లుగా వెల్లడైంది.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి.. సింఫుల్ గా చెప్పాలంటే సీఎంఐఈ వెల్లడించిన వివరాలు షాకింగ్ గా మారాయి. మహమ్మారి వేళ.. మారిన పరిస్థితులకు తగ్గట్లు.. ఇంజనీర్లు.. ఫిజీషియన్లు.. ఉపాధ్యాయులు ఇలా వైట్ కాలర్ ఉద్యోగాలు ఏకంగా 66 లక్షలు పోయినట్లుగా తేల్చారు. 2016 తర్వాత ఇలాంటి పరిస్థితి లేదని తేల్చారు. అంతేకాదు.. తాజా పరిణామాల నేపథ్యంలో గడిచిన నాలుగేళ్లుగా సంపాదించిన లాభాలు మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లుగా తేల్చారు.

వీరే కాదు.. వివిధ పరిశ్రమకలు చెందిన 50 లక్షల మంది కార్మికులు కూడా ఉపాధిని కోల్పోయినట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కన్జ్యూమర్ పిరమిడ్ హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా ఈ సంస్థ విశ్లేషన చేస్తుంది. నాలుగు నెలల్లో ఉపాధి పోగొట్టుకున్న వైట్ కాలర్ ఉద్యోగులకు.. ఉపాధి నైపుణ్యం ఉన్న వ్యాపారవేత్తల్ని కలుపలేదని.. వారిని కలిపితే అంకె భారీగా పెరుగుతుందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. చిన్న తరహా పరిశ్రమల్లో తీవ్రమైన ఒత్తిడి ఉదని.. మధ్యతరహా పరిశ్రమలు సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. క్లరికల్ ఉద్యోగులు కరోనా వేళ.. పెద్దగా ప్రభావితం కాలేదన్నారు. వర్క్ ఫ్రం హోం దీనికి కారణంగా చెబుతున్నారు. ఏప్రిల్ లో 121 మిలియన్ల ఉద్యోగాలు పోయినట్లుగా సీఎంఐఈ గతంలో అంచనా వేసిందని.. వారిలో కొందరు ఆగస్టు నాటికి ఉద్యోగాలు పొందారని చెబుతున్నారు. అయితే.. అదేమీ భారీగా లేదంటున్నారు. ఏమైనా.. జీతాలు పొందే ఉద్యోగుల పరిస్థితి క్లిష్టంగానే ఉందన్నవిషయాన్ని తాజా విశ్లేషణ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.

This post was last modified on September 19, 2020 6:16 pm

Share

Recent Posts

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

7 minutes ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

43 minutes ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

1 hour ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

2 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

2 hours ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

3 hours ago