Movie News

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ దక్కించుకుంటాయి. కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ‘అన్బే శివం’ ఆ కోవకు చెందిన సినిమానే. తెలుగులో ‘సత్యమే శివం’ పేరుతో రిలీజైన ఈ చిత్రాన్ని చూస్తే.. మనసున్న ప్రేక్షకులు ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే. మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సందేశాన్ని ఈ చిత్ర కథ, పాత్రలతో వ్యక్తీకరించిన తీరు అద్భుతం.

‘ప్లేన్స్, ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్’ అనే హాలీవుడ్ మూవీ నుంచి థీమ్ తీసుకుని, కమల్ హాసన్ అద్భుతమైన స్క్రిప్టు అందించడమే కాక.. ప్రధాన పాత్రలో గొప్పగా నటించారు. మాధవన్ కూడా ఆయనతో పోటీ పడి యాక్ట్ చేశాడు. సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే ఈ సినిమాకు ప్రశంసలు తప్పితే కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. థియేటర్లలో ఇది యావరేజ్ సినిమాగా నిలిచింది. దర్శకుడిగా మంచి పనితనమే చూపించినప్పటికీ.. సుందర్.సి ఈ చిత్రం తర్వాత బాగా ఇబ్బంది పడ్డాడు. తన కెరీర్‌ను ఈ సినిమా దెబ్బ తీసిందని కూడా కొన్ని సందర్భాల్లో సుందర్ చెప్పుకున్నాడు.

ఐతే నిజానికి ఈ సినిమాను ముందు ముందు దర్శకుడిగా అనుకున్నది కె.ఎస్.రవికుమార్‌ను అట. ఆయన ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాల్సిందట. అంతే కాదు మొదట మాధవన్ చేసిన పాత్రను మోహన్ లాల్‌తో చేయించాలని కూడా అనుకున్నారట. ఐతే కథ విషయంలో కమల్‌తో ఏకాభిప్రాయం కుదరక తాను తప్పుకున్నట్లు మాధవన్‌తో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో రవికుమార్ వెల్లడించాడు.

ఈ సినిమా క్లైమాక్స్‌లో తన ప్రియురాలిని కొత్త మిత్రుడికి ఇచ్చి పెళ్లి చేయడమే కాక, కార్మికులకు సాయం చేసి వెళ్లిపోతాడు కమల్. ఆ సన్నివేశంతో ఆ పాత్ర గొప్పదనం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఐతే ఇలా సినిమాను ముగించడం రవికుమార్‌కు నచ్చలేదట.

చివరికి హీరో.. స్నేహితుడికి ప్రియురాలిని ఇచ్చేసి వెళ్లిపోవడం కరెక్ట్ కాదని తాను కమల్‌తో వాదించానని, ఐతే మీకు నచ్చకపోయినా పర్వాలేదని, కథ ఇలాగే ముగియాలని కమల్ స్పష్టం చేశాడని.. దీంతో తాను ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశానని రవికుమార్ తెలిపాడు. ఐతే సినిమా చూసిన ఎవ్వరికైనా ఇప్పుడు సినిమాలో ఉన్న క్లైమాక్సే కరెక్ట్ అనిపించకమానదు. కానీ రవికుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి కమల్, మోహన్ లాల్ కలిసి నటించి ఉంటే మాత్రం సినిమా కమర్షియల్‌గా పెద్ద రేంజికి వెళ్లేదేమో.

This post was last modified on August 6, 2026 9:32 pm

Share

Recent Posts

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

1 hour ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

2 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

4 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

4 hours ago

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

5 hours ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

6 hours ago