కొన్నేళ్ల కిందట ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో కుర్రాళ్లలో కలకలం రేపిన అమ్మాయి హెబ్బా పటేల్. ఆ సినిమాలో ఆమె బోల్డ్ రోల్ చేసి ప్రేక్షకుల్లోనే కాదు.. పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ దెబ్బతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తర్వాతి కాలంలో హెబ్బా చేసిన సినిమాలు చాలా వరకు ఆమెలోని గ్లామర్‌ను ఎలివేట్ చేసినవే.
ఐతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఆమె దారి తప్పింది. ఎడాపెడా సినిమాలు ఒప్పుకుని పరాజయాలు ఎదుర్కొంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మధ్య మరీ వ్యాంప్ తరహా పాత్రలకు పరిమితం అయిపోతోంది హెబ్బా. ‘భీష్మ’లో ఆమె చేసిన కాల్ గర్ల్ క్యారెక్టర్ చూసి చాలామంది షాకయ్యారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘ఒరేయ్ బుజ్జిగా’లో ఆమెది ఏటైపు పాత్రో తెలియదు మరి.
ఐతే హెబ్బా ఒప్పుకున్న కొత్త సినిమాలో మాత్రం తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన, ఎప్పుడూ పోషించని తరహా పాత్ర చేస్తోందని స్పష్టమవుతోంది. ఆ సినిమానే ‘ఓదెల రైల్వే స్టేషన్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ వశిష్ఠ సింహా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సంపత్ నంది స్క్రిప్టు అందించడం విశేషం. అతడితో ‘బెంగాల్ టైగర్’ సినిమాను నిర్మించిన కేకే రాధామోహన్ నిర్మాత. అశోక్ తేజ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
హెబ్బా విషయానికి వస్తే ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోంది. అది కూడా కాటన్ చీరల్లో, మేకప్ లేకుండా ఆమె నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పచ్చటి పొలాల మధ్య ఒక మామూలు పల్లెటూరి అమ్మాయిలా హెబ్బా కూర్చుని ఉన్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అందులో హెబ్బాను చూసిన వాళ్లంతా ఇది ఆమేనా అని షాకవుతున్నారు. తన తొలి సినిమా ‘అలా ఎలా’లో పల్లెటూరి పాత్రే చేసినా.. దాంతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉండబోతోందన్నది స్పష్టం.
This post was last modified on September 19, 2020 1:10 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…