అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. విచ్చలవిడి తుపాకీ సంస్కృతి కొనసాగుతున్న ఈ దేశంలో ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్.. తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. 37 ఏళ్ల జానీ వాకర్‌ను దుండగులు అడ్డగించి కాల్పులు జరిపారు. అనంతరం.. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఉన్న నగదు.. ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులను దోచుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంరేపింది.
ఏం జరిగింది?
ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో(భారత కాలమానం) వాక్టర్ తన తల్లి స్కార్లెట్‌తో కలిసి లాస్ ఏంజెలస్‌లోని డౌన్‌టౌన్లో కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఓ కాటలిక్ట్ కన్వర్టర్ ను కొందరు దొంగిలిస్తున్న ఘటన వాక్టర్ కంట పడింది. దీంతోకారును ఆపి.. ఆయన వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో వారు ఆయనపైకాల్పులు జరిపారు. అనంతరం.. కారులో ఉన్న ఆయన తల్లిని పక్కకు తోసి.. నగదు.. ఇతర వస్తువులు దోచుకున్నారు.
విషయం తెలిసిన పోలీసులు తీవ్రంగా గాయపడ్డ వాక్టర్ ను వెనువెంటనే ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే.. అప్పటికే వాక్టర్ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా, తొలినాళ్లలో టీవీ షోలతో ప్రేక్షకులకు చేరువైన వాక్టర్.. 2007లో లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత.. వచ్చిన వెబ్ సిరీస్ మరింత హిట్ కొట్టడంతో సినిమాల్లోకి ప్రవేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates