పిక్ టాక్: చీరకే అందమొచ్చిందే..

గత ఏడాది అమిగోస్ అనే సినిమా ఒకటి వచ్చిన సంగతి కూడా జనాలకు గుర్తు లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఆ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన అమ్మాయి.. ఆశికా రంగనాథ్. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ అమ్మాయి మన జనాల దృష్టిలో పడలేదు. కానీ అక్కినేని నాగార్జున, విజయ్ బిన్నిల దృష్టిని మాత్రం ఈ కన్నడ అమ్మాయి బాగానే ఆకర్షించింది. విజయ్ దర్శకత్వంలో నాగ్ నటించిన ‘నా సామి రంగ’ కోసం ఈ అమ్మాయినే కథానాయికగా ఎంచుకున్నారు. ఈ సినిమా ప్రోమోల నుంచే ఆశిక కుర్రాళ్ల దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టింది.