Trends

సింహాల‌కు అక్బ‌ర్‌-సీత పేర్లు.. కోర్టుకెక్కిన వీహెచ్‌పీ

వీహెచ్‌పీ.. విశ్వ‌హిందూప‌రిషత్‌. ఈ పేరు వింటే.. అంటే కూడా.. వివాదాల‌కు కేంద్రం. న‌చ్చ‌క‌పోయినా.. ఇది నిజం. ఇప్పుడు మ‌రోసారి ఇది నిజ‌మైంది. సింహాల‌కు పేర్లు పెట్ట‌డాన్ని.. వీహెచ్‌పీ నిరసిస్తోంది. అంతేకాదు.. కోర్టుకు కూడా వెళ్లింది. ఈ చిత్ర‌మైన వివాదం.. ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలు.. మ‌మ‌తా బెన‌ర్జీ ముఖ్య‌మంత్రిగా ఉన్న ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగింది.

ఇదీ.. వివాదం!

ప‌శ్చిమ బెంగాల్‌లో అట‌వీ శాఖ అధికారులు రెండు సింహాల‌ను ఎన్ క్లోజ‌ర్‌లో పెట్టారు. ఇది స‌హ‌జ‌మే. ఎందుకంటే.. ఎంత జాతీయ జంతువైనా.. క్రూర‌త్వం వాటి ల‌క్ష‌ణం కాబట్టి బంధించే ఉంచుతారు. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేదు. అయితే.. ఈ సింహాల్లో ఒక‌టి మ‌గ‌ది, రెండోది ఆడది. అయితే.. అధికారులు వీటిని ఒకే ఎన్‌క్లోజ‌ర్‌లో పెట్టి.. వాటికి పేర్లు పెట్టారు. మ‌గ సింహానికి అక్బ‌ర్ అని, ఆడ సింహానికి సీత అని నామ‌క‌ర‌ణం చేశారు.

అంతే.. దీనిపై వీహెచ్‌పీ నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా.. పేర్లు పెట్ట‌డం ఏంటి? అని నిల‌దీస్తున్నారు. రెండు కూడా హిందూ దేవ‌త‌ల‌కు సంబంధించిన పేర్లు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్ప‌టికే అట‌వీ శాఖ అధికారుల‌కు ప‌లుమార్లు చెప్పి చూశారు. కానీ వారు దీనిని ప‌క్క‌న పెట్టారు. ఎందుకంటే.. ఎక్క‌డైనా బీజేపీ, వీహెచ్‌పీ ప‌ప్పులు ఉడుకుతాయేమోకానీ.. మ‌మ‌త ఇలాకాలో వీరి ఆట‌లు సాగ‌వు క‌దా!

దీంతో ఇప్పుడు వీహెచ్‌పీ నాయ‌కులు ఏకంగా కోర్టుకు వెళ్లారు. బెంగాల్ స‌ఫాయి పార్క్ డైరెక్ట‌ర్‌ను ప్ర‌తివాదిగా పేర్కొంటూ.. జ‌ల్‌పాయిగుడీ కోర్టులో కేసు వేశారు. హిందువుల మ‌నోభావాల మేర‌కు పేర్లు మార్చాల‌ని.. ముఖ్యంగా మ‌గ సింహం పేరును రాముడిగా పెట్టాల‌నేది వీరి డిమాండ్. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు సోమ‌వారం విచారిస్తామ‌ని పేర్కొంది. మ‌రి ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇక‌, ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి వాద‌న‌లు వినిపిస్తారో కూడా చూడాలి.

This post was last modified on February 18, 2024 11:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago