Trends

సక్సెస్ ఫుల్ గా మనిషి మెదడులో చిప్.. ఎలాన్ మస్క్ ప్రకటన

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వాద ప్రతివాదనలు.. అనుకూలతలు.. వ్యతిరేకతలు గట్టిగా ఎదురయ్యే అంశం ఒకటి గుట్టుచప్పుడు కాకుండా పూర్తైంది. మనిషి మెదడులో చిప్ పెట్టే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ప్రపంచ కుబేరుడు.. న్యూరాలింక్ వ్యవస్థాపకుడైన ఎలాన్ మస్క్ తాజాగా వెల్లడించారు. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాల్లో కీలక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. చిప్ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పిన మస్క్.. ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ ను గుర్తించినట్లుగా వెల్లడించారు. ఈ ప్రయోగంపై కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కంప్యూటర్ తో మనిషి మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ ప్రయోగాలకు అమెరికాలోని ఎఫ్ డీఏ (పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్)కు అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. గత ఏడాది మేలో అనుమతులు లభించగా.. తాజాగా తాము ఒక వ్యక్తి మెదడులో చిప్ ను విజయవంతంగా ప్రవేశ పెట్టిన విషయాన్ని ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించారు.

నిజానికి ఇప్పటికే ఈ తరహా చిప్ ను పందులు.. కోతుల్లో విజయవంతంగా పరీక్షలు జరిపారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదిగా.. విశ్వసనీయమైనదిగా చెబుతారు. ఒక మనిషిలో ఈ తరహా చిప్ లు పది వరకు ఏర్పాటు చేయొచ్చని చెబుతారు. నిజానికి ఈ తరహా ప్రయోగాల్ని ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ మాత్రమే కాదు ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ కూడా చేసింది. 2022లో యూఎస్ కు చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్ అమర్చింది. కాకుంటే.. తాజా ప్రయోగం మాదిరి కాకుండా పుర్రెకు ఎలాంటి కోత పెట్టకుండా చిప్ ను అమర్చింది.

ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ మాత్రం.. పుర్రెలోని చిన్న భాగాన్ని తొలగించి అక్కడ చిప్ ను అమరుస్తారు. ఎన్1గా పేర్కొనే ఈ చిప్ బ్రెయిన్ – కంప్యూటర్ ఇంటర్ ఫేస్ లో 8 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. ఈ చిప్ నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్ లో 3వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరుగా ప్రవేశ పెడతారు.

ఈ చిప్ ప్రత్యేకత ఏమంటే.. ఇది సుతిమెత్తగా ఉండటమే కాదు ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్నసందేశాన్ని గుర్తించి చిప్ నకు పంపుతాయి. ఒక చిప్ లో ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాల్ని గుర్తించి చిప్ నకు పంపుతాయి. ఈ చిప్ ను మెదడులో అమర్చిన తర్వాత దాని నుంచి విద్యుత్ సంకేతాలను పంపటం.. అందుకోవటం లాంటివి చేస్తుంది. ఆ ప్రక్రియ మొత్తాన్ని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్ లుగా మారుస్తుందని చెబుతున్నారు. తాజా ప్రయోగం తర్వాతి రోజుల్లో ఏ తరహా పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

This post was last modified on January 30, 2024 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

57 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago