ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తో వసూళ్లు పెంచుకుంటోంది. ఆయన పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న సైకో కిల్లర్ పాత్ర చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. గతంలో స్వలింగసంపర్కుడిగా నటించి ఆశ్చర్యపరిచిన మమ్ముట్టి ఇప్పుడీ క్యారెక్టర్ తో ఇంకో షాక్ ఇచ్చారు. దీంతో కొందరు ఒక మన సీనియర్ స్టార్లు కూడా ఇలా వయసుకు తగ్గట్టు కొత్త ప్రయోగాలు చేయాలని, ఎప్పుడూ మాస్ అంటూ మూసలో ఉండకూడదని సోషల్ మీడియాలో మమ్ముట్టితో పోలిక తెస్తున్నారు.
ఇది ముమ్మాటికీ రాంగే. ఎందుకంటే కేరళ, ఏపీ – తెలంగాణ ఆడియన్స్ అభిరుచుల్లో చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండటం వల్ల క్లాస్ కంటెంట్ కి ఆదరణ దక్కడం సహజం అందుకే ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్స్ పెడతారు. అందులోనూ గత అయిదేళ్లలో సైకో కిల్లింగ్ జానర్లో అక్కడ చాలా సినిమాలు వచ్చాయి. సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. కానీ మన ప్రేక్షకులకు ఆ జానర్ సూటవ్వదు. అందుకే అరుదుగా అలాంటి ఎక్స్ పరిమెంట్లు జరుగుతాయి. అప్పుడెప్పుడో భూమిక అనసూయ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు లాంటి కొన్ని హిట్లు మాత్రమే కనిపిస్తాయి. ఇది మనకు వాళ్లకు ఉన్న వ్యత్యాసం.
ఇక పోలిక విషయానికి వస్తే మనకు మాస్ సపోర్ట్ ఎక్కువ. ప్రయోగాలతో ఆ సెక్షన్ ఆడియన్స్ ని మెప్పించలేం. అందుకే చిరంజీవి నయనతారతో డ్యూయెట్ పాడాలి, బాలయ్య సంయుక్త మీనన్ తో డాన్స్ చేయాలి. అప్పుడే విజిల్స్ క్లాప్స్ పడతాయి. వెంకటేష్, నాగార్జున కూడా దీనికి మినహాయింపు కాదు. సేఫ్ గేమ్ నుంచి బయటికి వద్దామని చేసిన కుబేర, సైంధవ్ లాంటివి స్వంత ఫ్యాన్స్ కే నచ్చలేదు. నా సామిరంగాలో అల్లరి ఎంజాయ్ చేసిన అభిమానులు కూలిలో విలనిజంని ఒప్పుకోలేదు. మనకు ఆవనూనెతో చేసిన ఆవకాయ పచ్చడి ఇష్టం. కేరళ వాళ్ళకు కొబ్బరినూనెతో వండిన పదార్థాలు ఇష్టం. ఎవరి టేస్టు వాళ్లదే. అందరూ రైటే.
This post was last modified on December 6, 2025 10:47 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…