ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి వచ్చింది. ఉదాహరణకు నిన్న హైదరాబాద్ బుకింగ్స్ చూస్తే ఒక్కసారిగా రణ్వీర్ సింగ్ మూవీకి అనూహ్యమైన పికప్ కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం. బాలయ్య కోసం రిజర్వ్ చేసిన స్క్రీన్లను మెల్లగా దురంధర్, ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయితో పాటు మళయాలం కలం కవల్ కు ఇచ్చేయడంతో వాటి ఆక్యుపెన్సీలు మెరుగయ్యాయి. ఇక దురంధర్ విషయానికి వస్తే ప్రీ రిలీజ్ ముందు వరకు దీని మీద ఆశించిన బజ్ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది.
దురంధర్ ఒక వర్గం ఆడియన్స్ బాగానే నచ్చేశాడు. మూడున్నర గంటల నిడివిలో రిపీట్ అనిపించే యాక్షన్ బ్లాక్స్, లవ్ ట్రాక్ లాంటివి మైనస్ గా నిలిచినా ఇంటెన్స్ ఫైట్స్, కీలక నటీనటుల పెర్ఫార్మన్స్, ప్రొడక్షన్ వేల్యూస్ జనాన్ని చివరిదాకా కూర్చునేలా చేస్తున్నాయి. చాలా మందికి వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. దర్శకుడు ఆదిత్య ధార్ చాప్టర్ల వారిగా కథనాన్ని నడిపించడంతో విపరీతమైన ల్యాగ్ అనిపించిన మాట వాస్తవం. ఇంటర్వెల్ కే రెండు గంటలు పట్టిందంట నెరేషన్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ అయితే తప్ప దురంధర్ ని ఆస్వాదించడం కష్టమనేలా ఉంది.
కథ విషయానికి ఇది ఎప్పుడూ చూడనిది కాదు. భారత్ ఇంటెలిజెన్స్ చీఫ్ పాకిస్థాన్ కుట్రలను ఛేదించడం కోసం పంజాబ్ జైల్లో ఉన్న ఒక కరుడుగట్టిన కుర్రాడిని ఆపరేషన్ దురంధర్ పేరుతో పంపిస్తాడు. అతను అక్కడికి వెళ్లి చేసే విధ్వంసమే మెయిన్ స్టోరీ. షోలే, అజయ్ దేవగన్ ఖయామత్ లాంటి ఎన్నో పాత సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్న ఆదిత్య ధార్ దానికి టెర్రరిజం, యానిమల్ తరహా అగ్రెసివ్ వయొలెన్స్ జోడించాడు. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉన్నప్పటికీ ఎడిటింగ్, ల్యాగ్ పెద్ద గుదిబండగా మారిన దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చి 16 విడుదల కానుంది. అది ఎంత నిడివి ఉంటుందో మరి.
This post was last modified on December 6, 2025 10:32 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…