బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా బాధ పెట్టాయి. ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్లు మొదలవ్వాల్సి ఉండగా హఠాత్తుగా క్యాన్సిల్ కావడం ఊహించని ట్విస్టు. దీని వల్ల అభిమానుల మనసులు గాయపడటమే కాదు అంత కన్నా ఎక్కువ నష్టం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు భరిస్తున్నారు. ఎట్టకేలకు సానుకూల ఫలితం వచ్చే దిశగా చర్చలు ఫలప్రదమయ్యాననే సమాచారం నిన్న రాత్రే వచ్చింది కాని అసలైన ఛాలెంజ్, సవాళ్లు అఖండ 2కు ఇక ముందున్నాయి.
వాటిలో మొదటిది కొత్త రిలీజ్ డేట్. డిసెంబర్ 12 మంచి ఆప్షనే కానీ అప్పటికంతా లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి కావాలి. మంగళవారం లేదా బుధవారానికి అవ్వొచ్చని అంటున్నారు. కానీ నిర్ధారణగా చెప్పడం లేదు. డిసెంబర్ 19 లేదా 25 చూద్దామంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ ఉన్న నేపథ్యంలో ఓవర్సీస్ లో మంచి రిలీజ్ దక్కడం చాలా కష్టం. సంక్రాంతి గురించి ఆలోచించడం కూడా రిస్కే. ఎందుకంటే ఆల్రెడీ ఏడు సినిమాలు అఫీషియల్ గా పండగను లాక్ చేసుకున్నాయి. కనీసం రెండు తప్పుకుంటే తప్ప అఖండ 2కి సరైన స్పేస్ దొరకదు. అది కూడా అంత ఈజీ కాదు. ఈ క్యాలికులేషన్స్ మధ్య సమయం గడిచిపోతోంది.
వీటికి తోడు ఆల్రెడీ జరిగిన థియేటర్, బిజినెస్ అగ్రిమెంట్లను మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రేట్లు పెంచడం తగ్గించడం లాంటివి జరగొచ్చు. ఇప్పుడీ పోస్ట్ పోన్ ప్రభావం ఓపెనింగ్స్ మీద ఎంత ఉంటుందనే దాని మీద ఎగ్జిబిటర్లలు రకరకాల విశ్లేషణల్లో ఉన్నారు. బయటికి కనిపించకపోయినా బాలయ్యతో సహా టీమ్ మొత్తం ఇదే ఇష్యూ మీద పోరాడుతున్న మాట వాస్తవం. చివరికి ఈ మలుపులు ఏ మజిలీకి చేరుకుంటాయో అంతు చిక్కడం లేదు. ఫ్యాన్స్ అయితే ఏ క్షణమైనా శుభవార్త వింటామనే నమ్మకంతో ఉన్నారు. అదేదో ఓ మూడు నాలుగు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రూపంలో ఇస్తే అంతా సెట్.
This post was last modified on December 6, 2025 10:29 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…