ద్వారక.. హిందువులకు ప్రత్యేకమైన దివ్య ప్రాంతం. భగవాన్ శ్రీకృష్ణుడు నిర్మించిన భవనంగా ఆయన నివసించిన భవనంగా పురాణాలు చెబుతున్నాయి. అయితే.. ఇది ప్రత్యక్షంగా కనిపించదు. ఎందుకంటే.. ఇది సముద్రంలో చాలా లోతున మునిగిపోయి ఉంది. దీంతో ద్వారక పర్యటన అంటే.. కేవలం సదరు సముద్ర తీరానికి వెల్లి ఓ నమస్కారం చేసుకుని రావడమే. దీనినే పవిత్రంగా హిందు వులు భావిస్తున్నారు.
అయితే.. ఇప్పుడు సముద్రంలో నిక్షిప్తమైన ద్వారకను ప్రత్యక్షంగా చూసి తరించే అవకాశం రానుంది. అరేబియా సముద్రంలో మునగిపోయి ఉన్న ద్వారకా నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది.
దీనికిగాను ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజ్‌గావ్‌తో తాజాగా ఒప్పందం చేసుకుంది. ద్వాపరయుగం అనంతరం అరేబియా సముద్రంలో మునిగిన ఈ పురాతన నగరాన్ని సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్ పర్యాటక శాఖ తెలిపింది.
పర్యాటకు లతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారు. ఈ జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూసే అవకాశం ఉంది.
శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని కల్పించడం.. అది కూడా ఎన్నికలకు ముందు కావడం గమనార్హం. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలాంతర్గామిని ప్రారంభించాలని చూస్తోంది. పురాతన ద్వారక నగరం శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యం కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates