ఏమిటీ సెకండ్ వేవ్? మనకీ ముప్పు తప్పదా?

కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ఎంతలా మారిందో తెలిసిందే. సంపన్న దేశాలు సైతం ఈ మహమ్మారి బారిన పడినప్పుడు.. ఆయా దేశాల దైన్యం ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. ధనిక దేశాల సంగతే ఇలా ఉంటే.. పేద దేశాల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

మొదటి వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం.. తాజాగా సెకండ్ వేవ్ షురూ కానున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఈ సెకండ్ వేవ్ ఏమిటి? అదెలా ఉంటుంది? దానికి కారణం ఏమిటి? దానికి చెక్ పెట్టే అవకాశం లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

వైరస్ ఏదైనా సరే.. కొత్తగా విరుచుకుపడినప్పుడు.. దాన్ని ఎదుర్కొనే సత్తా శరీరానికి ఉండదు. దీంతో.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారంతా దాని బారిన పడుతుంటారు. ఈ క్రమంలో శారీరకంగా.. మానసికంగా బలహీనంగా ఉన్నవారు మరణిస్తుంటారు. కరోనా విషయానికి వస్తే.. విదేశాలతో పోలిస్తే.. మన దేశంలో మరణాలు తక్కువనే చెప్పాలి.నమోదైన కేసులు.. నమోదైన మరణాల్ని లెక్కలోకి తీసుకుంటే.. ప్రపంచ సగటుతో పోలిస్తే.. మన దేశంలో తక్కువనే చెప్పాలి.

ఇక.. సెకండ్ వేవ్ విషయానికి వస్తే.. ఒక వైరస్ ప్రారంభంలో దూకుడును ప్రదర్శిస్తుంటుంది. దీంతో.. లాక్ డౌన్.. భౌతిక దూరం లాంటి చర్యలు చేపట్టి.. వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సమయంలో వైరస్ వ్యాప్తి ఒక కొలిక్కి వస్తుంది.

కేసుల నమోదు తగ్గిందనుకున్న వేళలో.. కాస్త గ్యాప్ ఇచ్చి సెకండ్ వేవ్ దూసుకొస్తుంది. తొలిసారివచ్చిన దాని కంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం..వైరస్ తన రూపాన్ని మార్చుకోవటం.. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే వైరస్.. రెట్టించిన ఉత్సాహంతో విరుచుకుపడుతుంది.

అప్పటికే ఏం కాదులే అన్న భరోసా.. నిర్లక్ష్యం కారణంగా భారీ ఎత్తున దీని బారిన పడుతుంటారు. ఈ కారణంతో మొదటి వేవ్ తో పోలిస్తే.. రెండో వేవ్ బలంగా ఉండటమే కాదు.. నష్టం కూడా ఎక్కువే. ఇప్పుడుచెన్నైలో ఇలాంటి పరిస్థితే చోటు చేసుకొని.. రెండోసారి లాక్ డౌన్ విధించటం వెనుక అసలు కారణం ఇదేనట. అమెరికాలోనూ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని చెబుతున్నారు.

చాలా దేశాల్లో కేసుల నమోదు తగ్గుముఖం పట్టినంతనే లాక్ డౌన్ ఎత్తేయటం.. పరిమితులు సడలించటం లాంటివి చేయటంతో.. సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. త్వరలోనే మన దేశంలోనే ఇలాంటి పరిస్థితే ఉంటుందని.. అందుకే మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. సో.. బీకేర్ ఫుల్.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)